నోవాస్‌ సూపర్‌

Published: Sun, 29 May 2022 03:53:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నోవాస్‌ సూపర్‌

మూడోసారి టీ20 చాలెంజ్‌ టైటిల్‌ కైవసం 

4 పరుగులతో వెలాసిటీ ఓటమి


పుణె: ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఫైనల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న సూపర్‌నోవాస్‌.. మహిళల టీ20 చాలెంజ్‌ టైటిల్‌ను ఎగరేసు కుపోయింది. శనివారం హోరాహోరీగా సాగిన ఫైన ల్లో నోవాస్‌ 4 పరుగుల తేడాతో వెలాసిటీని ఓడించి మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌నోవాస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.  ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ డియాండ్ర డాటిన్‌ (44 బంతుల్లో ఫోర్‌, 4 సిక్స్‌లతో 62) అర్ధ శతకంతో అదరగొట్టింది. మరో ఓపెనర్‌ ప్రియా పూనియా (28)తో కలసి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన డాటిన్‌.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (29 బంతుల్లో ఫోర్‌, 3 సిక్స్‌లతో 43) జతగా రెండో వికెట్‌కు 58 రన్స్‌ జోడించింది. ఛేదనలో వెలాసిటీ ఓవర్లన్నీ ఆడి 161/8 స్కోరే చేసింది. లారా వాల్వార్ట్‌ (40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 65 నాటౌట్‌) టాప్‌ స్కోరర్‌.


షఫాలీ (15), యాస్తిక (13), కిరణ్‌ ప్రభు (0), చాంతమ్‌ (6), కెప్టెన్‌ దీప్తి శర్మ (2), స్నేహ్‌ రాణా (15) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఓ దశలో 117/8తో దారుణమైన ఓటమి అంచున ఉన్న జట్టుకు లారా, సిమ్రన్‌ (20 నాటౌట్‌) అండగా నిలిచారు. చివరి 12 బంతుల్లో 34 రన్స్‌ అవసరమవగా.. సిమ్రన్‌ 3 బౌండ్రీలు బాదడంతో లక్ష్యం ఆఖరి ఓవర్‌లో 17 రన్స్‌కు దిగివచ్చింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య 20వ ఓవర్‌ తొలి బంతిని లారా సిక్స్‌కు తరలించి ఆశలు రేపినా.. మిగతా 5 బంతుల్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చిన ఎకెల్‌స్టోన్‌.. సూపర్‌నోవా్‌సను గెలిపించింది. 


సంక్షిప్త స్కోర్లు

సూపర్‌నోవాస్‌: 20 ఓవర్లలో 165/7 (డాటిన్‌ 62, హర్మన్‌ప్రీత్‌ 43; దీప్తి 2/20, కేట్‌ క్రాస్‌ 2/29). 

వెలాసిటీ: 20 ఓవర్లలో 161/8 (లారా 65 నాటౌట్‌, సిమ్రన్‌ 20 నాటౌట్‌; అలెన్‌ 3/32, డాటిన్‌ 2/28, ఎకెల్‌స్టోన్‌ 2/28). 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.