రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. కరెంట్ బిల్లు కట్టలేదంటూ ఫోన్లు.. కనెక్షన్ కట్ చేస్తామని భయపెట్టి రూ.60 వేలు స్వాహా..!

ABN , First Publish Date - 2022-06-30T21:04:49+05:30 IST

`మీ విద్యుత్ మీటర్‌పై జరిమానా పడింది. కనెక్షన్ కట్ కాకుడదంటే వెంటనే జరిమానా కట్టిండి. ఈ అకౌంట్‌కు డబ్బులు పంపండి`..

రూటు మార్చిన సైబర్ నేరగాళ్లు.. కరెంట్ బిల్లు కట్టలేదంటూ ఫోన్లు.. కనెక్షన్ కట్ చేస్తామని భయపెట్టి రూ.60 వేలు స్వాహా..!

`మీ విద్యుత్ మీటర్‌పై జరిమానా పడింది. కనెక్షన్ కట్ కాకూడదంటే వెంటనే జరిమానా కట్టిండి. ఈ అకౌంట్‌కు డబ్బులు పంపండి`.. ఇలాంటి మెసేజ్ మీకు వచ్చిందా? తొందరపడి వెంటనే స్పందించకండి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు చేస్తున్న కొత్త మోసం ఇది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక వ్యక్తికి ఇలాంటి మెసేజ్ వచ్చింది. ఒక వ్యక్తి ఎలక్ట్రిసిటీ ఆఫీసర్‌లా మాట్లాడి అతడి నుంచి రూ.60 వేలు కొట్టేశాడు. తర్వాత విషయం తెలుసుకున్న ఆ యువకుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. 


ఇది కూడా చదవండి..

ఏడాది క్రితం పెళ్లి.. అర్ధరాత్రి భర్త ఆత్మహత్యాయత్నం.. విచారణలో భార్య గురించి అతడు చెప్పిన నిజాలు విన్న పోలీసులకు..


ఈ నెల 13న కిద్వాయ్ నగర్‌కు చెందిన రౌనక్ జైన్ అనే వ్యక్తికి మీ కరెంటు బిల్లు బకాయి అని మెసేజ్ వచ్చింది. `మీ విద్యుత్ కనెక్షన్‌ డిస్‌కనెక్ట్ అవుతుంది, వెంటనే ఎలక్ట్రిసిటీ అధికారితో మాట్లాడండి` అని మెసేజ్‌లో ఉంది. దీంతో అతను కాల్ చేశాడు. అవతలి వైపు విద్యుత్ శాఖ అధికారిగా మాట్లాడిన దుండగుడు మొదట అతని అకౌంట్ వివరాలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో రూ.2 చెల్లించాలని కోరారు. ఆ తర్వాత చూసుకుంటే రౌనక్ ఖాతాలోంచి రూ.60 వేలు మాయమయ్యాయి. 


షాకైన రౌనక్ సైబర్ సెల్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన సైబర్ సెల్ అధికారులు రూ. 60 వేలు తిరిగి రప్పించారు. ఎవరైనా సకాలంలో ఫిర్యాదు చేస్తే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు పెరుగుతాయని డీసీపీ క్రైం తెలిపారు. రౌనక్ ఫిర్యాదు చేయగానే స్పందించిన సైబర్ సెల్‌ అధికారులు దుండగుడి ఖాతాను స్తంభింపజేశారు. ఆ తర్వాత బాధితుడి ఖాతాలో సొమ్మును తిరిగి జమచేశారు.

Updated Date - 2022-06-30T21:04:49+05:30 IST