చేసిన ఫోన్లు చాలు, ఇక నగదు ఇవ్వండి: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-08-09T18:50:15+05:30 IST

ఒలింపిక్స్‌తో పాటూ ఇతర క్రీడాపోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు, పతక విజేతలకు ఇప్పటివరకూ నగదు బహుమతులు అందలేదన్న వార్తలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు.

చేసిన ఫోన్లు చాలు, ఇక నగదు ఇవ్వండి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌తో పాటూ గతంలో ఇతర క్రీడాపోటీల్లో పాల్గొన్న అథ్లెట్లకు, పతక విజేతలకు ఇప్పటివరకూ నగదు బహుమతులు అందలేదన్న వార్తలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ‘క్రీడాకారులకు చేసిన ఫోన్లు చాలు..ఇక నగదు బహుమతులు ఇవ్వండి. శుభాకాంక్షలతో పాటు నగదు బహుమతులు కూడా వారికి అందాలి..’’ అంటూ ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఈ వ్యాఖ్యలు ప్రధాని మోదీని ఉద్దేశించి చేసినవనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ‘‘4 ఏళ్ల గడిచినా హరియాణా అథ్లెట్లకు అందని నగదు బహుమతులు’’ శీర్షికతో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ జులైలో ప్రచురించిన ఓ వార్తా కథనాన్ని కూడా రాహుల్ గాంధీ తన ట్వీట్‌లో ప్రస్తావించారు. 



Updated Date - 2021-08-09T18:50:15+05:30 IST