మోదీ,సోనియా, ప్రియాంకచోప్రా,యోగి,హేమంత్ సోరెన్‌లు బీహార్‌లో రెండో COVID-19 vaccine తీసుకున్నారట...

ABN , First Publish Date - 2021-12-08T14:01:34+05:30 IST

కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం లబ్ధిదారుల డేటాను బీహార్ ఆరోగ్యశాఖ అధికారులు ఫోర్జరీ చేసిన ఘటన సంచలనం రేపింది....

మోదీ,సోనియా, ప్రియాంకచోప్రా,యోగి,హేమంత్ సోరెన్‌లు బీహార్‌లో రెండో COVID-19 vaccine తీసుకున్నారట...

వ్యాక్సిన్ లబ్ధిదారుల డేటా ఫోర్జరీ

పాట్నా: కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం లబ్ధిదారుల డేటాను బీహార్ ఆరోగ్యశాఖ అధికారులు ఫోర్జరీ చేసిన ఘటన సంచలనం రేపింది.బీహార్ రాష్ట్రంలోని అర్వాల్‌లో కొవిడ్ వ్యాక్సిన్ లబ్ధిదారుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సినీనటి ప్రియాంక చోప్రా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, రాష్ట్ర ఆరోగ్య మంత్రి మంగళ్‌ల పేర్లు ఉన్నాయి. బీహార్‌లోని గయా జిల్లాలో మొదటి డోస్ కొవిడ్ వ్యాక్సిన్ లబ్ధిదారుల జాబితాలో ఫోర్జరీ జరిగిందని తేలింది.ఫోర్జరీ వివాదాల మధ్య తమ శాఖ పరువు తీసేలా కొందరు వ్యక్తులు డేటా ఫోర్జరీ చేశారని బీహార్ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆరోపించింది. 


వ్యాక్సిన్ జాబితా ఫోర్జరీ వెలుగుచూసిన తర్వాత  గయా పట్టణ సివిల్ సర్జన్ డాక్టర్ అరవింద్ కుమార్ టెకారి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.‘‘గయాలోని టెకారి పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీపూర్ హెల్త్ సెంటర్‌లో కరోనా మొదటి డోస్ గ్రహీతల డేటాలో కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చేర్చారని మేం గుర్తించాం. దీని ప్రకారం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు పెట్టాం. మూడు ఫోన్ నంబర్లు ఇచ్చారు.’’అని సివిల్ సర్జన్ చెప్పారు.వారు ఇచ్చిన ఫోన్ నంబర్లలో ఒకటి జమ్మూ కాశ్మీర్‌కు చెందినది కాగా, మరో రెండు నంబర్లు స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు గుర్తించారు.


ప్రాథమిక విచారణ ప్రకారం కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం పోర్టల్‌లో ఎఎన్ఎం ఉషాకుమారి మొబైల్ నంబర్ యూజర్ ఐడీ పాస్‌వర్డ్‌గా పేర్కొన్నారు. ఆ మొబైల్ నంబర్‌ను దేశంలోని ప్రముఖ నాయకుల పేర్లను అప్‌లోడ్ చేయడానికి కొంతమంది వ్యక్తులు ఉపయోగించారని సివిల్ సర్జన్ చెప్పారు.టీకాల జాబితాను ఫోర్జరీ చేసి నేతల పేర్లు పెట్టిన నిందితులను గుర్తించేందుకు సైబర్ నిపుణుల సహాయం తీసుకుంటున్నామని సివిల్ సర్జన్ తెలిపారు.


Updated Date - 2021-12-08T14:01:34+05:30 IST