రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చడమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-07-27T03:17:32+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చడమే ధ్యేయంగా జిల్లాలోని అధికారులకు అవగాహన కల్పిస్తున్నామని రాష్ట్ర ఉపాధి హామీ పథకం డైరెక్టర్‌ చిన్నతాతయ్య అన్నారు.

రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చడమే లక్ష్యం
అధికారులకు అవగాహన కల్పిస్తున్న ఈజీఎస్‌ డైరెక్టర్‌ చిన్నతాతయ్య

ఈజీఎస్‌ డైరెక్టర్‌ చిన్నతాతయ్య

బిట్రగుంట, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా మార్చడమే ధ్యేయంగా జిల్లాలోని అధికారులకు అవగాహన కల్పిస్తున్నామని రాష్ట్ర ఉపాధి హామీ పథకం డైరెక్టర్‌ చిన్నతాతయ్య అన్నారు. బోగోలు మండలం స్త్రీ శక్తి భవనంలో ఎంపీడీవో నాసరరెడ్డి ఆధ్వర్యంలో  సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని క్లస్టర్ల ఏపీడీ, ఏపీవో, ఈసీలతో మొక్కలు నాటి పెంచడం, సంరక్షించడంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు కోటి మొక్కలు నాటాలన్నదే ధ్యేయంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యంగా గతంలో జరిగిన పొరపాటులను దృష్టిలో పెట్టుకొని పంచాయతీ సర్పంచులు, కార్యదర్శు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో మొక్కలు నాటి  సంరక్షించనున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-07-27T03:17:32+05:30 IST