గల్ఫ్ నుంచి శాశ్వతంగా తిరిగొచ్చి.. ఈ ఎన్నారై నిర్మిస్తున్న ఇంటిని చూసి నివ్వెరపోతున్న జనం..!

Jun 16 2021 @ 20:36PM

కేరళలో ఎన్నారై థామస్ నిర్మిస్తున్న వింత ఇల్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 30 ఏళ్లు బహ్రెయిన్‌లో ఉద్యోగం చేసిన థామస్ విశ్రాంత జీవితాన్ని సొంత ఊరు మల్లప్పలేలో గడపాలనుకున్నాడు. అందుకోసం ఓ ఇంటిని నిర్మించాలనుకున్నాడు. జీవితంలో చాలా భాగం ప్రయాణంలోనే గడిపిన థామస్ తన ఇంటిని కూడా అలాగే కట్టుకోవాలనుకున్నాడు. 


విమానం, రైలు, ఓడ కాంబినేషన్‌లో ఓ భారీ ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈ ఇంటిని చూసి స్థానికులే కాదు ఇతర ప్రాంతాల వారు కూడా ఆశ్చర్యపోతున్నారు. `నా జీవితమంతా నేను విమానాలు, రైళ్లు, ఓడల్లో ప్రయాణాలు చేశాను. అందుకే నా ఇంటిని వాటిలా కట్టాలనుకున్నాను. నా ఆలోచన చెప్పినపుడు చాలా మంది ఎగతాళి చేశారు. అయితే ప్రస్తుతం చివరి దశలో ఉన్న ఇంటిని చూసేందుకు వారే వస్తున్నార`ని థామస్ చెప్పాడు. 20 సెంట్ల స్థలంలో సంవత్సరానికిపైగానే ఇంటి నిర్మాణం జరిగింది. త్రిబుల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, బాల్కనీ ఈ ఇంటిలో ఉన్నాయి. కాంక్రీట్ ఇంటితో పోల్చుకుంటే ఈ ఇంటి నిర్మాణానికి తక్కువ ఖర్చే అయిందని ఆయన చెప్పాడు. 


Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...