Advertisement

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మహిళా న్యాయవాది అశ్లీల ఫొటోలను నెట్టింట పెట్టిన ఎన్నారై

Apr 8 2021 @ 11:25AM

అహ్మదాబాద్: సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఎన్నారైను నమ్మి.. ఓ మహిళా న్యాయవాది మోసపోయిన ఉదంతం ఇది. తనకు పెళ్లి కాలేదని, మంచి అమ్మాయి కోసం చూస్తున్నట్లు లాయర్‌ను నమ్మించిన ఎన్నారై.. అతని గురించి నిజం తెలియడంతో ఆ తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు. న్యాయవాది ఫొటోలను అశ్లీలంగా చిత్రీకరించడంతో పాటు వాటిని సెక్స్ వర్కర్ పేరుతో అంతర్జాలంలో పెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉండే అమేజ్ లోఖండ్‌వాలా అనే ఎన్నారైతో ఢిల్లీ దర్వాజాలోని సలాత్వాద్‌కు చెందిన 29 ఏళ్ల మహిళా న్యాయవాదికి గతేడాది ఏప్రిల్‌లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. దాంతో ఇద్దరూ తరచూ చాటింగ్ చేసుకునే వారు. ఈ క్రమంలో ఒకరోజు తనకు 34 ఏళ్లని, ఇంకా పెళ్లి కాలేదని, మంచి అమ్మాయి కోసం చూస్తున్నట్లు న్యాయవాదితో లోఖండ్‌వాలా చెప్పాడు. అంతటితో ఆగకుండా ఆమెను నమ్మించేందుకు ఏకంగా ఓ నకిలీ బర్త్ సర్టిఫికేట్ కూడా పంపించాడు. అది చూసిన ఆమె నిజం అని నమ్మేసింది. అలాగే లోఖండ్‌వాలాను పెళ్లి చేసుకునేందుకు ఓకే చెప్పింది. దాంతో ఆమె ఫొటోలు అడిగి తీసుకున్నాడు. అలాగే తన మొబైల్ నెంబర్ కూడా ఇచ్చింది. 

 

ఈ క్రమంలో ఒకరోజు లాయర్‌కు ఓ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. లోఖండ్‌వాలాకు వివాహమైందని, అతని వయస్సు 48 ఏళ్లని, 17 ఏళ్ల కూతురు కూడా ఉన్నట్లు ఆమె చెప్పింది. అది విన్న న్యాయవాదికి మైండ్‌బ్లాంక్ అయింది. వెంటనే ఈ విషయమై లోఖండ్‌వాలాను నిలదీసింది. దాంతో తనకు అసలు పెళ్లి కాలేదని, నీకు ఫోన్ చేసిన మహిళ నా అన్నయ్య భార్య అని, వారిద్దరికి సంబంధించిన ఓ పెళ్లి ఫొటోను కూడా లోఖండ్‌వాలా ఆమెకు పంపించాడు. ఇదిలాఉండగా.. కొన్ని రోజుల తర్వాత ఇంతకుముందు లాయర్‌కు ఫోన్ చేసిన మహిళ ఈసారి వాట్సాప్ వీడియో కాల్ చేసింది. అందులో లోఖండ్‌వాలా పక్కన ఓ మహిళ ఉండడం కనిపించింది. అందులో కనిపిస్తున్న మహిళనే అతని భార్య అని వీడియో కాల్ చేసిన మహిళ చెప్పింది. దాంతో అప్పటి నుంచి తనను మోసం చేసిన లోఖండ్‌వాలాతో ఆమె మాట్లాడటం మానేసింది. ఈ క్రమంలో అతగాడు తన వద్ద ఉన్న ఆమె ఫొటోలను అశ్లీలంగా చిత్రీకరించి అంతర్జాలంలో పెట్టాడు. పైగా ఆమెను వ్యభిచారిగా పేర్కొన్నాడు. నెట్టింట ఆ ఫొటోలు చూసిన బాధితురాలు కరంజ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.     

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.