ఏళ్ల తర్వాత స్వదేశంలో అడుగుపెట్టిన దంపతులు.. కొద్ది గంటల్లో ఇంటికి చేరుకుంటారనగా.. ఇంతలో..

ABN , First Publish Date - 2022-04-27T23:53:05+05:30 IST

ఆ దంపతులు విదేశాలకు వెళ్లి ఏళ్లు గడిచిపోయాయి. స్వదేశానికి రావాలని, సొంత వాళ్లను కళ్లారా చూసి వాళ్ల ప్రేమాభిమానాలను సొంతం చేసుకోవాలని ఎన్నో సార్లు అనుకున్నారు. కానీ పని ఒత్తిడి కారణంగా అది వీలు

ఏళ్ల తర్వాత స్వదేశంలో అడుగుపెట్టిన దంపతులు.. కొద్ది గంటల్లో ఇంటికి చేరుకుంటారనగా.. ఇంతలో..

ఎన్నారై డెస్క్: ఆ దంపతులు విదేశాలకు వెళ్లి ఏళ్లు గడిచిపోయాయి. స్వదేశానికి రావాలని, సొంత వాళ్లను కళ్లారా చూసి వాళ్ల ప్రేమాభిమానాలను సొంతం చేసుకోవాలని ఎన్నో సార్లు అనుకున్నారు. కానీ పని ఒత్తిడి కారణంగా అది వీలుపడలేదు. చివరకు ఎలాగోలా వీలు కల్పించుకుని స్వదేశానికి పయనమయ్యారు. మాతృదేశంలో అడుగుపెట్టారు. మరికొద్ది గంటల్లో స్వగ్రామానికి చేరుతారనే లోపు ఘోరం జరిగిపోయింది. ఆ దంపతుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బుధవారం ఉదయం తెలంగాణలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



కృష్ణాజిల్లాలోని రెడ్డిగూడెమ్‌కు చెందిన హేమమ్ బరదార్(40), రజిత (35) దంపతులు కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లారు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ పిల్లలను చదువించుకుంటున్నారు. చాన్నాళ్ల తర్వాత స్వదేశానికి పయనమైన ఈ దంపతులు.. ఇద్దరు పిల్లలతో సహా మంగళవారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యారు. అనంతరం ఓ ట్యాక్సీ మాట్లాడుకుని సొంతూరుకి బయల్దేరారు. అయితే వాళ్లు ప్రయాణిస్తున్న కారు సూర్యపేటలోని గుంపుల గ్రామం వద్దకు చేరుకోగానే అదుపుతప్పింది. కల్వర్ట్ వద్ద ఉన్న గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హేమమ్, రజిత ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు పిల్లలు, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతూ డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. 




Updated Date - 2022-04-27T23:53:05+05:30 IST