అమెరికాలో ప్రవాసీ ప్రముఖుడు కన్నుమూత

ABN , First Publish Date - 2021-12-14T14:18:32+05:30 IST

తెలంగాణలోని హన్మకొండకు చెందిన ప్రవాసీ అమెరికాలో కన్నుమూశారు. కరోనా బారిన పడి నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ నెల మొదటి వారంలో మృత్యువాత పడ్డారు. ఉద్యమ కాలం

అమెరికాలో ప్రవాసీ ప్రముఖుడు కన్నుమూత

ఉద్యమకాలం నుంచి  టీఆర్‌ఎస్‌లో పని చేస్తున్న  శ్రీధర్‌

కరోనాతోమృత్యువాత

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి): తెలంగాణలోని హన్మకొండకు చెందిన ప్రవాసీ అమెరికాలో కన్నుమూశారు. కరోనా బారిన పడి నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ నెల మొదటి వారంలో మృత్యువాత పడ్డారు. ఉద్యమ కాలం నుంచి అమెరికాలో టీఆర్‌ఎస్‌ తరఫున చురుగ్గా పని చేసిన బండారు శ్రీధర్‌ మృతిపై గల్ఫ్‌లోనూ పలువురు విచారం వ్యక్తం చేశారు. గత నెలలో దుబాయిలో బుర్జు ఖలీఫా భవనంపై బతుకమ్మ ప్రదర్శన కార్యక్రమానికి హాజరయ్యేందుకు అమెరికా నుంచి దుబాయి వచ్చిన శ్రీధర్‌ కరోనా బారిన పడినట్లు సమాచారం. దుబాయి నుంచి పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో శ్వాసకు సంబంధించిన సమస్య ఏర్పడడంతో హడావుడిగా ఆయన అమెరికా వెళ్లిపోయారు. అక్కడ ఆస్పత్రిలో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. కరోనా కారణంగా శ్రీధర్‌ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చే వీలు లేకపోవడంతో అమెరికాలోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. హన్మకొండలో ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం దశదిన కర్మ కార్యక్రమం నిర్వహించగా.. ఎమ్మెల్సీ కవితతోపాటు అక్కడి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.




Updated Date - 2021-12-14T14:18:32+05:30 IST