దేశాధినేతల ప్రశంసలు పొందిన NRI బాలిక..!

ABN , First Publish Date - 2022-01-19T00:53:31+05:30 IST

జంతువులంటే ఆ చిన్నారికి అమితమైన ప్రేమ! అంతేకాదు.. వాటి సంరక్షణ కోసం తన వద్ద దాచుకున్న డబ్బంతా విరాళంగా ఇచ్చేసేంత మంచి మసను ఆమె సొంతం. ఇలా.. కేవలం 14 ఏళ్ల చిరుప్రాయంలో తన పెద్దమనసు చాటుకున్న ఆ ఎన్నారై బాలిక ఎవరో కాదు..మన భారతీయ సంతతికి చెందిన ప్రజ్ఞశ్రీ.

దేశాధినేతల ప్రశంసలు పొందిన NRI బాలిక..!

ఇంటర్నెట్ డెస్క్:  జంతువులంటే ఆ చిన్నారికి అమితమైన ప్రేమ! అంతేకాదు.. వాటి సంరక్షణ కోసం తన వద్ద దాచుకున్న డబ్బంతా విరాళంగా ఇచ్చేసేంత మంచి మనసు ఆమె సొంతం. ఇలా.. కేవలం 14 ఏళ్ల చిరు ప్రాయంలో తన పెద్దమనసు చాటుకున్న ఆ బాలిక ఎవరో కాదు..మన భారతీయ సంతతికి చెందిన ప్రజ్ఞశ్రీ. చిన్న వయసులో తన దొడ్డ మనసు చాటుకున్న ప్రజ్ఞ.. ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉగాండా దేశాధ్యక్షుడి ప్రశంసలకు పాత్రురాలైంది. ఉగాండాలో నివసిస్తున్న ప్రజ్ఞశ్రీ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచీ ఆమెకు జంతువులన్నా, మొక్కలన్నా ఎంతో ఇష్టం. మూగజీవాలు, ప్రకృతి పట్ల తనకున్న అభిమానమే ఆమెను మరో ముందడుగు వేసేలా ప్రేరేపించింది. జంతువుల సంరక్షణ కోసం నడుం కట్టిన ప్రజ్ఞ..స్థానిక జూలోని ఏనుగు, ఓ సింహం పిల్లను దత్తత తీసుకుంది.  


ఇక నాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆమె.. అనేక ప్రదర్శనలు, పోటీల్లో పాల్గొని, వాటిల్లో గెలిచిన నగదు బహుమతులను కూడా జంతు సంరక్షణకే కేటాయించింది. కరోనా సంక్షోభం సమయంలో తను దాచుకున్న డబ్బును జంతువుల సంరక్షణ కోసం విరాళంగా ఇచ్చింది. ఆమె మంచి మనసు, సేవాతత్పరత.. ఉగాండా అధ్యక్షుడు యొవేరీ కటుగా ముసవేనిని కూడా ఆకట్టుకున్నాయి. దీంతో.. ఆయన ప్రజ్ఞను స్వయంగా కలుసుకుని అభినందించారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అరుదైన అవకాశం కూడా ప్రజ్ఞకు లభించింది. ఉగాండా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీకి ప్రజ్ఞ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికింది. ఆ సందర్భంగా ఆమె.. ఉగాండా జాతీయ గీతం ఆలపించి ఇరు దేశాధినేతల ప్రశంసలు పొందింది. 



Updated Date - 2022-01-19T00:53:31+05:30 IST