రియల్ ఎస్టేట్‌లో భారీగా పెరిగిన ఎన్నారైల పెట్టుబడులు

ABN , First Publish Date - 2021-04-10T18:37:48+05:30 IST

భారతీయ రియల్ ఎస్టేట్‌లో ఎన్నారై పెట్టుబడులు 6 శాతానికి పైగా పెరిగినట్లు తాజాగా 360 రియల్టర్స్ నివేదిక వెల్లడించింది.

రియల్ ఎస్టేట్‌లో భారీగా పెరిగిన ఎన్నారైల పెట్టుబడులు

న్యూఢిల్లీ: భారతీయ రియల్ ఎస్టేట్‌లో ఎన్నారై పెట్టుబడులు 6 శాతానికి పైగా పెరిగినట్లు తాజాగా 360 రియల్టర్స్ నివేదిక వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఎన్నారైలు స్వదేశంలో రియల్ ఎస్టేట్‌లో ఏకంగా 13.3 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఈ నివేదిక గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇది 6.4 శాతం అధికం. కాగా, ఆకర్షణీయమైన చెల్లింపు ప్రణాళికలు, గృహ రుణ రేట్ల తగ్గింపు, రూపాయి విలువ పడిపోవడం, డిజిటల్ చెల్లింపులు వంటి పలు కారణాల వల్ల ఎన్నారైలు రియల్ రంగంలో అధిక పెట్టుబడులకు మోగ్గు చూపారని తెలుస్తోంది. అలాగే కరోనా మహమ్మారి విజృంభణ వేళ కూడా రియల్ ఎస్టేట్‌లో ఎన్నారైలు దూసుకుపోవడం విశేషం. ఇక ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 12 శాతం పెరుగుదలతో మొత్తం పెట్టుబడులు 14.9 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని నివేదిక అంచనా వేసింది.     

Updated Date - 2021-04-10T18:37:48+05:30 IST