2024 ఎన్నికల్లో TDP గెలుపే లక్ష్యంగా పని చేస్తాం: NRI టీడీపీ నాయకుడు కిషోర్ బాబు

ABN , First Publish Date - 2022-05-02T16:45:03+05:30 IST

ఎన్నారై టీడీపీ యూరోప్ టీం నాయకుడు డాక్టర్ కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. సుమారు 30 నిమిషాలు మాట్లాడారు. ఈ సందర్భంగా NRI టీడీపీ యూరోప్ విభాగంలోని అన్ని సామజిక వర్గాల నాయకులు కలిసి 40 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ దినో

2024 ఎన్నికల్లో TDP గెలుపే లక్ష్యంగా పని చేస్తాం: NRI టీడీపీ నాయకుడు కిషోర్ బాబు

ఎన్నారై డెస్క్: ఎన్నారై టీడీపీ యూరోప్ టీం నాయకుడు డాక్టర్ కిషోర్ బాబు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును మర్యాద పూర్వకంగా కలిశారు. సుమారు 30 నిమిషాలు మాట్లాడారు. ఈ సందర్భంగా NRI టీడీపీ యూరోప్ విభాగంలోని అన్ని సామజిక వర్గాల నాయకులు కలిసి 40 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని యూరోప్‌లోని అన్ని పట్టణాల్లో ఏవిధంగా చేసింది వివరించారు. అలాగే నెల్లూరు, చిత్తూరు జిల్లా పూతలపట్టు, గుంటూరు జిల్లా అమరావతిలో ఐటీడీపీ టీం సహకారంతో NRI టీడీపీ యూరోప్ TEAM ఏర్పాటు చేసిన అన్నదానం గురించి తెలిపారు.


భవిష్యత్తులో NRI యూరోప్ TEAM చేయబోయే కార్యక్రమాలు.. 2024 ఎన్నికలలో తమ వంతు సహకారం గురించి గురించి చంద్రబాబుతో కిషోర్‌బాబు చర్చించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే ప్రధానంగా పని చేయనున్నట్లు తెలిపారు. యూరోప్ TEAM ఆధ్వర్యంలో చేయబోయే మహానాడు కార్యక్రమాల గురించి కూడా మాట్లాడారు.



అంగరంగ వైభవంగా జరిపిన 40 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించడటం పట్ల టీడీపీ యూరోప్ టీమ్‌ను చంద్రబాబు అభినందించారు. అదేవిధంగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రల విద్యార్థులను సొంత రాష్ట్రాలకు తరలించడంలో యూరప్ టీమ్ చేసిన కృషిని ప్రశంసించారు. మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సూచించారు. అంతేకాకుండా ప్రతీ ఒక్క NRI ఒక వ్యాపారవేత్తగా మారి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకి ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా పెట్టుబడుల కోసం యూరోప్‌లో పర్యటించిన రోజులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. చివరిగా 2024లో పార్టీ గెలుపునకు శ్రమించాలని చెప్పారు. NRI టీడీపీ యూరోప్ TEAM మున్ముందు చేసే సేవాకార్యక్రమాలకు పార్టీ తరఫు పూర్తి సహకారం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.




Updated Date - 2022-05-02T16:45:03+05:30 IST