ఎన్ఆర్‌ఐ టీడీపీ సెల్ కువైట్ ఆధ్వర్యంలో వైభవంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు!

ABN , First Publish Date - 2022-04-22T02:58:20+05:30 IST

నవ్యాంధ్ర దార్శనికుడు, అమరావతి సృష్టికర్త, భావితరాల స్ఫూర్తి ప్రదాత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవాన్ని ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ కువైట్ విభాగం వైభవంగా నిర్వహించింది.

ఎన్ఆర్‌ఐ టీడీపీ సెల్ కువైట్ ఆధ్వర్యంలో వైభవంగా టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు!

నవ్యాంధ్ర దార్శనికుడు, అమరావతి సృష్టికర్త, భావితరాల స్ఫూర్తి ప్రదాత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవాన్ని ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ కువైట్ విభాగం వైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందు నిర్వహించిన అనంతరం టీడీపీ అభిమానులు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకను జరిపించారు. 


ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ టిడిపి సెల్ సీనియర్ నాయకులు వెంకట్ కోడూరి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి భావితరాల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సంపద సృష్టి జరిగి మళ్లీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే చంద్రబాబు  ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు.


ఎన్ఆర్ఐ టిడిపి సెల్ సీనియర్ నాయకులు సురేష్ మాలేపాటి మాట్లాడుతు ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ ఇబ్బందులు తొలగి ప్రజలకు సౌకర్యవంతమైన జీవనం అందాలంటే రాష్ట్రానికి టీడీపీ అధినేత అవసరం ఎంతైనా ఉందన్నారు.  ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి చంద్రబాబును రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్  అంధకారం అవుతుందన్నారు.


ఎన్ఆర్ఐ టిడిపి సెల్ సీనియర్ నాయకులు ఉదయ్ ప్రకాష్  మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రం దివాలా తీసేస్థితికి చేరుకుందని,  ప్రజలపై అనేక రకాల పన్నులు,అప్పులు వేసి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారే తప్ప ఎక్కడా కూడా ఒక్కరూపాయి సంపద సృష్టి జరగడం లేదన్నారు. ఇటువంటి సైకో, తుగ్లక్ పరిపాలనకు చరమగీతం పాడాలంటే టీడీపీ ఎన్నారై మద్దతుదారులందరూ పార్టీ కోసం కష్టపడి పని చేసి చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. అలా జరగని పక్షంలో ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందన్నారు.


ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టిడిపి గల్ఫ్ గుదె శంకరయ్య,  ఆయన కార్యవర్గం, ఎన్ఆర్ఐ టిడిపి మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శి పి.మస్తాక్ ఖాన్, వారి కార్యవర్గం, ఎన్ టి ఆర్ సేవా సమితి అధ్యక్షులు చుండు బాలరెడ్డయ్య, వారి కార్యవర్గం, ఎన్ టి ఆర్ పరిటాల ట్రస్ట్ అధ్యక్షులు జి. నరసింహులు, వారి కార్యవర్గం,చంద్రన్న సేవా సమితి అధ్యక్షులు షేక్ సుబహాన్,  వారి కార్యవర్గం, తెలుగుదేశం కువైట్ అధ్యక్షులు ఎన్. విజయ్ కుమార్ చౌదరి, వారి కార్యవర్గ సభ్యులు మరియు సీనియర్ నాయకులు వేగి వెంకటేష్,  ఇతర తెలుగుదేశం నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కువైట్ కౌన్సిల్ సభ్యులు ఓలేటి రెడ్డయ్య చౌదరి, షేక్ యం.డి.అర్షద్ కోఆర్డినేట్ చేశారు.

#NRITDPCell_Kuwait #BirthdayCelebrationsOfNCBN #HBDTrendSetterCBN #HappyBirthdayCBN

Updated Date - 2022-04-22T02:58:20+05:30 IST