కువైత్‌లో NRI TDP ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-05-28T13:27:39+05:30 IST

కువైత్‌లో ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ అభిమానులు స్థానికంగా మహానాడు, ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోటాపోటిగా నిర్వహించిన మహానాడు విజయవంతమైంది. అక్కిలి నాగేంద్రబాబు అధ్వర్యంలోని ఎన్నారై తెలుగుదేశం, కువైట్‌ నిర్వహించిన మహానాడుకు భారీ స్పందన లభించింది. కుంటుపడ్డ అభివృద్ధిను...

కువైత్‌లో NRI TDP ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు

కువైత్‌లో ఘనంగా మహానాడు.. పోటాపోటీగా NTR శతజయంతి వేడుకల నిర్వహణ

కువైత్ తెదేపా అభిమానులలో నూతనోత్సాహం

అంగరంగ వైభవంగా ఎన్నారై  కువైత్ (నాగేంద్రబాబు వర్గం)  మహానాడు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కువైత్‌లో ప్రవాసాంధ్ర తెలుగుదేశం పార్టీ అభిమానులు స్థానికంగా మహానాడు, ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోటాపోటిగా నిర్వహించిన మహానాడు విజయవంతమైంది. అక్కిలి నాగేంద్రబాబు అధ్వర్యంలోని ఎన్నారై తెలుగుదేశం, కువైట్‌ నిర్వహించిన మహానాడుకు భారీ స్పందన లభించింది. కుంటుపడ్డ అభివృద్ధిను పునరుద్ధరించడానికి తెలుగుదేశంను అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రతి ప్రవాసీయుడు తనవంతు కృషి చేయాలని మహానాడు కోరింది. కార్యక్రమానికి రాజంపేట నియోజకవర్గం ఇన్ చార్జి , తెదేపా ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగళ్ రాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కరోనా కట్టడి వలన గత రెండెళ్ళుగా సబ్దతగా ఉన్న పార్టీ కార్యక్రమాలు మహానాడుతో ఒక్కసారి వేడెక్కాయి. కులాల మధ్య చిచ్చు పెట్టె విధంగా జగన్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర యత్నాలను మహానాడు ఖండించింది. 


ఈ సందర్భంగా అమరులైన నాయకులకు, కార్యకర్తలకు, ఇతరులకు సంతాప సూచకంగా సభకు హాజరైన ప్రతినిధులు, పరిశీలకులు, అతిథులు, ప్రజలు  NRI తెలుగుదేశం కువైత్ మహాసభలో మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారని ఎన్నారై తెలుగుదేశం కువైత్ అధ్యక్షులు అక్కిలి నాగేంద్ర బాబు తెలిపారు. కార్యక్రమంలో చంద్రశేఖర్ రాజు, బలరాం నాయుడు, కె. నరసింహ నాయుడు, యనిగల బాలకృష్ణ, సాయి సుబ్బారావు, కె. పార్ధసారది, రత్నం నాయుడు తుమ్మల, ప్రసాద్ పాలేటి, ఆవుల చిన్నయ్య యాదవ్, ఈరాతి శంకరయ్య, శీను, గుండయ్య నాయుడు, పసుపులేటి విజయకుమార్, పసుపులేటి మల్లికార్జున, పసుపులేటి వెంకట రమణ, రాచూరి మోహన్ (NRI TDP కువైత్, జాయింట్ సెక్రెటరీ), మల్లి కార్జున్ నాయుడు(NRI TDP కువైత్ తెలుగుయువత అధ్యక్షులు), వలసాని శంకర్ యాదవ్ (NRI TDP కువైత్ బీసీ అధ్యక్షులు), బొమ్మునరసింహా (NRI TDP కువైత్ బీసీ గౌరవ అధ్యక్షులు), రాణి చౌదరి (NRI TDP కువైత్ మహిళా అధ్యక్షురాలు), ఇందు (NRI TDP కువైత్ మహిళా విభాగం కార్యదర్శి, వెలిగండ్ల శ్రీనివాసరాజు, (NRI TDP కువైత్ ఉపాధ్యక్షులు), మురళి నాయుడు  (NRI TDP కువైత్ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి), రమేష్ కొల్లపనేని (NRI TDP కువైత్ తెలుగుయువత సమన్వయకర్త) తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-28T13:27:39+05:30 IST