NRI woman ఐడియాకు హ్యాట్సాఫ్.. ఎండ వేడికి యూకే ప్రజలు అల్లాడుతుంటే.. కేవలం రూ.195తో అద్భుతం చేసింది!

ABN , First Publish Date - 2022-07-20T22:40:41+05:30 IST

బ్రిటన్‌లో వేసవి కాలం ప్రారంభమైపోయింది. ఈ క్రమంలోనే లండన్ సహా పలు ప్రాంతాల్లో అత్యధిక ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో సాధారణంగా చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేసే యూకే ప్రజలు.. వేడికి అల్లాడుతున్నారు. ఊష్ణోగ్రతలు 40 డి

NRI woman ఐడియాకు హ్యాట్సాఫ్.. ఎండ వేడికి యూకే ప్రజలు అల్లాడుతుంటే.. కేవలం రూ.195తో అద్భుతం చేసింది!

ఎన్నారై డెస్క్: బ్రిటన్‌లో వేసవి కాలం ప్రారంభమైపోయింది. ఈ క్రమంలోనే లండన్ సహా పలు ప్రాంతాల్లో అత్యధిక ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో సాధారణంగా చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేసే యూకే ప్రజలు.. వేడికి అల్లాడుతున్నారు. ఊష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరటం వల్ల చెమటలు కక్కుతున్నారు. అయితే.. ఓ ఎన్నారై మహిళ మాత్రం.. ఒకే ఒక్క ఐడియాతో తక్కవ ఖర్చులోనే హీట్‌ను బీట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆమె చేసిన పని నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



భారత్‌కు చెందిన జే విర్దీ (Jay Virdee) బకింగ్‌హామ్‌షైర్ (Buckinghamshire) ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈమె గత కొంత కాలంగా ఊరిపితిత్తులు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా వేడి వాతావరణానికి ఆమె దూరంగా ఉండాలి. అయితే.. యూకేలో వేసవి కాలం మొదలవడంతో ఊష్ణోగ్రతలు క్రమంగా పెరిగాయి. దీంతో Jay Virdee‌కు ఓ ఐడియా వచ్చింది. భారత కరెన్సీ ప్రకారం రూ.195కే దొరకే మెటల్ పేపర్(వంటింట్లో ఉపయోగించే అల్యూమినియం పేపర్ వంటిది)ను కొనుగోలు చేసింది. అనంతరం వాటితో గుమ్మాన్ని, కిటికీలను కప్పేసింది. మెటల్ పేపర్ సుమారు 4 డిగ్రీల సెల్సియస్ ఊష్ణోగ్రతను గ్రహిస్తుండటంతో.. ఆమె ఇంట్లో సాధారణ ఊష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ట్విట్టర్ ద్వారా నెటిజన్లతో పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఆమె చేసిన పని హాట్‌ టాపిక్ అయింది. 


Updated Date - 2022-07-20T22:40:41+05:30 IST