వేర్‌హౌసింగ్), లాజిస్టిక్స్... పెట్టుబడిదారుల దృష్టి...

ABN , First Publish Date - 2022-01-21T22:22:23+05:30 IST

ఎన్‌ఆర్‌ఐలు, హెచ్‌ఎన్‌ఐల రూటు... ‘లాజిస్టిక్స్‌’ దిశగా సాగుతోంది. కోల్డ్ స్టోరేజ్‌లే బ్రహ్మాండమైన భవిష్యత్తు అవకాశాలనిస్తాయని భావిస్తున్నారు.

వేర్‌హౌసింగ్), లాజిస్టిక్స్... పెట్టుబడిదారుల దృష్టి...

హైదరాబాద్ : ఎన్‌ఆర్‌ఐలు, హెచ్‌ఎన్‌ఐల రూటు... ‘లాజిస్టిక్స్‌’ దిశగా దృష్టి సారిస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్‌లే బ్రహ్మాండమైన భవిష్యత్తు అవకాశాలనిస్తాయని భావిస్తున్నారు. ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐలు), హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌(హెచ్‌ఎన్‌ఐలు), అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్‌(యూహెచ్‌ఎన్‌ఐలు) ఈ సెగ్మెంట్‌లోకి వందల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. ఎన్‌ఆర్‌ఐలు, హెచ్‌ఎన్‌ఐలు సాధారణంగా నివాస, కార్యాలయ ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతుంటారన్న విషయం తెలిసిందే.


తాజాగా... ట్రెండ్‌ ఒకింత మారింది. ఆశాజనకంగా ఉన్న దేశ ఆర్థిక వృద్ధి, ఈ-కామర్స్ వ్యాపారాల్లో వేగం, జీఎస్‌టీ సంస్కరణలు, మెరుగైన రాబడికి అవకాశాలు తదితర అంశాల నేపధ్యంలో... లాజిస్టిక్స్‌పై ఎన్‌ఆర్‌ఐలు, హెచ్‌ఎన్‌ఐలు ప్రత్యేకంగా ఈ దిశగా ద‌ృష్టి సారించారు. వేర్‌హౌసింగ్‌లో పెట్టుబడులు పెట్టడానికి హెచ్‌ఎన్‌ఐల నుంచి నిధులు సేకరించిన అవిజ్ఞ గ్రూప్ చెబుతున్న ప్రకారం... అద్దె వృద్ధితో ఈ విభాగం 8-10 % రాబడిని అందిస్తుందని, మహమ్మారి సమయంలో రిస్క్‌ లేని వ్యాపారమని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ఇక... మరోవైపు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్‌, రియల్ ఎస్టేట్ డెవలపర్స్‌ కూడా వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ సెగ్మెంట్లపై దృష్టి సారించడం మొదలైంది. ఈ క్రమంలో... ఈ-కామర్స్, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ప్లేయర్ల నుంచి వచ్చే డిమాండ్‌తో ఈ విభాగం బలాన్ని పెంచుకుంటుందని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తాయన్న అంచనాలున్నాయి. 

Updated Date - 2022-01-21T22:22:23+05:30 IST