‘దళిత బంధు' పథకంపై ఎన్నారైల హర్షం

ABN , First Publish Date - 2021-07-20T00:05:04+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘దళిత బంధు’ పథకంపట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయ

‘దళిత బంధు' పథకంపై ఎన్నారైల హర్షం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘దళిత బంధు’ పథకంపట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. రూ.1200 కోట్లతో దళిత బంధు పథకం ప్రారంభం కానుందనీ.. మొద‌టి ద‌శ‌లో ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున‌ రాష్ట్ర‌వ్యాప్తంగా 11,900 కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించనున్నట్టు ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. 



కాగా.. దళితుల సాధికారత కోసం తెచ్చిన ‘దళిత బంధు' పథకంపట్ల ఎన్నారైలంతా హర్షిస్తున్నారని చెప్పారు. పేదలు, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధి‌తో కృషి చేస్తున్న నాయకుడు కేసీఆరే అని ఎన్నారైలంతా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని ఆరోపించారు. దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకోవాల్సిన అందరిపై ఉందని అభిప్రాయపడ్డారు.  


Updated Date - 2021-07-20T00:05:04+05:30 IST