London లో ఘనంగా మహానాడు

Published: Sun, 29 May 2022 14:24:59 ISTfb-iconwhatsapp-icontwitter-icon
London లో ఘనంగా మహానాడు

లండన్: యూకే రాజధాని లండన్‌లో మహానాడు (Mahanadu) ఘనంగా జరిగింది. 'మా తెలుగు తల్లికి మల్లెపు దండ.. మా కన్నతల్లికి మంగళారతులు' ఆంధ్ర రాష్ట్ర గీతంతో, జ్యోతి ప్రజ్వలనతో మహానాడు ప్రారంభమైంది. ఈ మహానాడుకి ఉన్న ప్రత్యేకత వేరు. తెలుగువారి ఆరాధ్య దైవం, వెండితెర ఇలవేల్పు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ డా. నందమూరి తారక రామారావు 99వ జయంతి.. రాబోవు శత జయంతి ఉత్సవాలను సంవత్సరమంతా చేయాలని పార్టీ నిర్ణయించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఉత్సాహంతో, ఉరకలు వేస్తూ యూకే వ్యాప్తంగా అన్ని నగరాల నుంచి మహానాడు వేదికకు చేరుకున్నారు. అన్న గారి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా పూలు జల్లి, నమస్కరించుకుంటూ, జోహర్ ఎన్టీఆర్ అంటూ నినదించారు. 

London లో ఘనంగా మహానాడు

మహానాడు కార్యక్రమంలో పార్టీ కోసం త్యాగాలు చేసి తమ ప్రాణాలను సైతం అడ్డుపెట్టి అమరులైన కార్యకర్తల కోసం, నాయకుల కోసం మౌనం పాటించారు. ఆ తారక రాముని జననం, ఉద్యోగం, సినీ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం జపకాలతో మొదలై తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు, పార్టీ ఆవిర్భావం, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా పెట్టిన పథకాలు, తెలుగు వారి ఆత్మగౌరవం నిలబడేలా చేసి, తెలుగు వారి ఖ్యాతిని దేశవిదేశాల్లో చాటి చెప్పిన తీరు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జోహర్ ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. వైసీపీ ప్రభుత్వంలో పెరుగుతున్న ధరలు, వైఫల్యాలు, ఆడిపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అక‌ృత్యాలు, కరెంటు కొనుగోలు అవకతవకలు, నిరాదరణకు గురైన విద్య, వైద్య రంగాల గురించి చర్చించారు. తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం, 2024లో తెలుగుదేశం తిరిగి అధికారంలో తీసుకురావడానికి కృషి చేయాలని మహానాడులో తీర్మానాలు చేశారు. 

London లో ఘనంగా మహానాడు

ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జూమ్ కాల్ ద్వారా హాజరై పార్టీ పటిష్టానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ పట్ల ఎన్నారైల నిబద్ధతను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీదేవి గుంటుపల్లి హాజరై ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి వందల కొద్ది తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. 

London లో ఘనంగా మహానాడు

ఈ కార్యక్రమానికి జయకుమార్ గుంటుపల్లి, వేణు మాధవ్ పోపూరి, శ్రీనివాస్ పాలడుగు, ప్రసన్న నాదెండ్ల, శ్రీకిరణ్ పరుచూరి, నరేష్ మల్లినేని, భాస్కర్ అమ్మినేని, జయరామ్ యలమంచిలి, రవికాంత్ కొనేరు, లగడపాటి శ్రీనివాస్, చక్రి మువ్వ, నారాయణ రెడ్డి, సురేష్ కోరం, వీర పరిటాల, చందు నారా, సుందర్ రాజు మల్లవరపు, శివరాం కూరపాటి, కళ్యాణ్ కాపు, శ్రీకాంత్ యర్రం, మహేంద్ర తాళ్లూరు, శ్రీధర్ నారా, రవికిరణ్ అరవపల్లి, సురేష్ అట్లూరి, జోషిరావు నర్రా, ప్రభాకర్ అమిరినేని, శ్రీధర్ బెల్లం, వంశీ గొట్టిపాటి, పతంజలి కొల్లి, ఆర్‌కే రాయపూడి, అజయ్ ధూలిపాళ్ల, రాజశేఖర్ బోడపాటి, జనార్ధన్ పోలూరు, వినయ్ కామినేని తదితరులు తమ పూర్తి సహయసహకారాలు అందించారు. 


London లో ఘనంగా మహానాడు


London లో ఘనంగా మహానాడు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.