సింహగిరిపై ‘నృసింహ వైభవం’ కళా రూపకం షూటింగ్‌

ABN , First Publish Date - 2022-08-09T06:21:22+05:30 IST

మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన ‘నృసింహ వైభవం’ నృత్య కళారూపకం షూటింగ్‌ సింహగిరిపై సోమవారం మొదలయ్యింది.

సింహగిరిపై ‘నృసింహ వైభవం’ కళా రూపకం షూటింగ్‌
కళాకారిణి పద్మామోహన్‌కు నృత్యరీతిని వివరిస్తున్న దర్వకుడు, నృత్య దర్శకుడు

యూట్యూబ్‌ చానల్‌ కోసం చిత్రీకరణ

సింహాచలం, ఆగస్టు 8: మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన ‘నృసింహ వైభవం’ నృత్య కళారూపకం షూటింగ్‌ సింహగిరిపై సోమవారం మొదలయ్యింది. దర్శకుడు మీర్‌ సింహాద్రినాథుని దర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి కల్యాణ మండపంలో చిత్రీకరణ మొదలు పెట్టారు. ప్రముఖ నృత్యకారిణి, విశ్రాంత పద్మామోహన్‌ ఈ రూపకంలో నటిస్తున్నారు. యూట్యూబ్‌ ద్వారా భక్తులకు చేరనున్న ఈ కళారూపకానికి నాట్యాచార్యులు కళా కృష్ణ నృత్య దర్శకత్వం వహిస్తున్నారు.


జాన్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. నృసింహావతార వైభవం గీతాన్ని ఆధ్యాత్మిక వేత్త రామానుజాచార్యులు రచించగా, ఫణినారాయణ సంగీత బాణీలు సమకూర్చారు. దర్శకులు మీర్‌ మాట్లాడుతూ నృసింహస్వామి వైభవాన్ని పూర్తి ఆంధ్ర నృత్యరీతిలో ప్రేక్షకులకు అందిస్తున్నట్ల తెలిపారు. దర్శకేంద్రుడు డాక్టర్‌ కె రాఘవేంద్రరావు మార్గనిర్దేశకత్వంలో ’కల్కి అండ్‌ ఫ్యామిలీ’ సినిమాను తెరకెకించనున్నట్టు మీర్‌ తెలిపారు. 


అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత కలియుగంలో కలిపురుషుడి ప్రభావం మానవాళిపై ఏ విధంగా ఉంటోంది అనే ఇతివృత్తాన్ని ప్రధానాంశంగా చేసుకుని త్వరలో సెట్స్‌పైకి వెళ్లుతున్నట్టు చెప్పారు. భగవద్రామానుజాచార్యులు జీవిత చరిత్ర కథాంశంగా వచ్చిన సినిమాకు ప్రేక్షకుల స్పందన బాగుందన్నారు. వకీల్‌సాబ్‌ సినిమా దర్శకత్వ విభాగంలో పనిచేసినట్లు చెప్పారు. 

Updated Date - 2022-08-09T06:21:22+05:30 IST