ప్లాన్‌గా.. చేతివాటం

ABN , First Publish Date - 2021-11-27T05:15:47+05:30 IST

అడిగినంత ఇస్తే చాలు.. నిబంధనలకు విరుద్ధమైనా ప్లాన్ల మంజూరు జరిగిపోతోంది.

ప్లాన్‌గా.. చేతివాటం
నరసరావుపేట మునిసిపల్‌ కార్యాలయం

అడిగినంత ఇస్తేనే ప్లాన్ల మంజూరు

ప్రణాళికా విభాగంలో నిబంధనలకు నీళ్లు

క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకుండానే అనుమతి 

నరసరావుపేటలో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు

టీపీవోకు కమిషనర్‌ షోకాజ్‌ నోటీసు జారీ?


 నరసరావుపేట, నవంబరు 26: అడిగినంత ఇస్తే చాలు.. నిబంధనలకు విరుద్ధమైనా ప్లాన్ల మంజూరు జరిగిపోతోంది. ప్రభుత్వ ఖజానాకు నష్టమైనా.. నిబంధనలు పాటించక పోయినా.. ప్లాన్లకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నా నరసరావుపేట పట్టణ ప్రణాళికా విభాగంలో ఇష్టారాజ్యంగా ప్లాన్ల మంజూరు అవుతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్లాన్ల మంజూరులో నిబంధనలకు నీళ్లొదులుతున్నా అడిగినంతా ఇస్తే చాలు పట్టించుకోరనే విమర్శలున్నాయి. ఆన్‌లైన్‌ విధా నంలో ప్లాన్లను మంజూరు చేస్తున్నా చేతివాటం షరామా మూలుగానే ఉంటుంది. భవన నిర్మాణదారులు ఆన్‌లైన్‌లో లైసెన్స్‌డ్‌ ప్లానర్స్‌ ద్వారా  ప్లాన్‌ మంజూరుకు దరఖాస్తు చేస్తారు. ఈ దరఖాస్తును సచివాయం ప్లానింగ్‌ కార్యదర్శి పరిశీలించి  ఆ వివరాల అఽధారంగా క్షేత్రస్థాయిలో స్థలాన్ని  పరిశీలించి రిమార్క్స్‌ నమోదు చేయాలి. తదుపరి ప్రణాళికా విభాగం సూపర్‌వైజర్‌ దరఖాస్తును పరిశీలించి సూచనలు చేస్తారు. అనంతరం ప్రణాళికా విభాగం అధికారి దరఖాస్తు పరిశీలించి వార్డు కార్యదర్శి, టీసీఎస్‌ రిమార్క్‌ అధారంగా ప్లాన్‌ మంజూరు చేయాలి. అయితే ఇవేవి జరగకుండా ఇక్క డి మున్సిపాల్టీలో ప్లాన్లు మంజూరు చేస్తున్న అంశం ఇటీవల వెలుగు చూసింది. లైసెన్స్‌డ్‌ ప్లానర్స్‌ అప్‌లోడ్‌ చేసిన దరఖాస్తును క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకుండా చేతివాటం ప్రదర్శిస్తూ ప్లాన్లు మంజూరు చేస్తున్నట్లు సమాచారం. ప్లాన్ల మంజూరులో సీసీఏ రూల్స్‌ను తుంగలో తొక్కుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రణాళికా విభాగం అధికారి ఎంవీ నరసింహా రావుకు మునిసిపల్‌ కమిషనర్‌ రామచంద్రారెడ్డి షోకాజ్‌ నోటీ సు జారీ చేసినట్టు తెలిసింది. టీపీవోకు రాజకీయ అండదం డలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్నది. నోటీసు అందు కున్న టీపీవో దీనిపై వివరణ ఇవ్వలేదని తెలుస్తుం ది. దీంతో తదుపరి చర్యలకు కమిషనర్‌ సిద్ధమైనట్లు సమాచారం.


అక్రమ పద్ధతిలో 71 ప్లాన్లు మంజూరు?

నరసరావుపేట మున్సిపాలిటీలో అక్రమ పద్ధతిలో ప్లాన్ల మంజూరుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఇటీవల కాలంలో మంజూరు చేసిన ప్లాన్లను పరిశీలించి విచారణ జరపగా  అక్రమ పద్ధతిలో  సుమారు 71 ప్లాన్లుగా తేలినట్లు సమాచారం. వీటి విషయంలో తాము ఎటువంటి రిమార్క్స్‌ నమోదు చేయలేదని వార్డు ప్లానింగ్‌ కార్యదర్శులు, ప్రణాళికా విభాగం సూపర్‌వైజర్‌  తెలిపినట్లు తెలిసింది. ప్లాన్లకు విరూ ద్ధంగా పట్టణంలో భారీ నిర్మాణాలు జరుగుతున్నా అధికారు లు మిన్న కుంటున్నారు. అక్రమ వసూళ్లతో ఆయా నిర్మా ణాలపై చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ నిర్మాణాల విషయంలో సుమారు రూ.15 లక్షలు చేతులు మారినట్లు ప్రచారం జరు గుతుంది. బీపీఎస్‌లో రాష్ట్రంలోనే నరసరావుపేట మునిసిపాల్టీ ముందు ఉంది. దాదాపు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే ఇక్కడ ఏ మేరకు నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణాలు జరుగుతున్నాయో అర్థమవుతుంది. ప్లాన్ల అక్రమాలపై కమిషనర్‌ని ప్రశ్నించగా ఫిర్యాదులు అందాయ ని, విచారణ జరిపి తగు చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు.

Updated Date - 2021-11-27T05:15:47+05:30 IST