మీడియా ప్రశ్నలపై స్పందించం.. పెగసస్ మాతృసంస్థ ప్రకటన

ABN , First Publish Date - 2021-07-22T05:58:50+05:30 IST

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పెగాసస్ వ్యవహారంపై దీని మాతృసంస్థ ఎన్ఎస్‌వో గ్రూప్ స్పందించింది.

మీడియా ప్రశ్నలపై స్పందించం.. పెగసస్ మాతృసంస్థ ప్రకటన

ఇజ్రాయెల్: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పెగాసస్ వ్యవహారంపై దీని మాతృసంస్థ ఎన్ఎస్‌వో గ్రూప్ స్పందించింది. ‘‘ఇక చాలంటే చాలు’’ (ఇనఫ్ ఈజ్ ఇనఫ్) పేరిట ఈ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవలి కాలంలో పెగాసస్‌పై వచ్చిన ఆరోపణలపై మీడియా వేసే ప్రశ్నలపై తాము స్పందించబోమని ఎన్ఎస్‌వో స్పష్టం చేసింది. ‘‘ఈ టెక్నాలజీని తప్పుడు ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే అంశంపై మేమే దర్యాప్తు చేస్తాం. ఆధారాలు కనిపిస్తే అవసరమైన ప్రాంతంలో ఈ సేవను రద్దు చేస్తాం’’ అని తమ వెబ్‌సైటులో ఎన్ఎస్‌వో పేర్కొంది. అలాగే పెగాసస్ నిఘా నీడలో ఉన్నట్లు బయటకు వచ్చిన ఫోన్ నెంబర్ల జాబితాతో తమ ఎన్‌ఎస్‌వోకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

Updated Date - 2021-07-22T05:58:50+05:30 IST