చిన్నారులకు అందుబాటులోకి మరో వ్యాక్సిన్.. కోవావ్యాక్స్‌కు ఎన్‌టాగి అనుమతి

Published: Fri, 29 Apr 2022 20:30:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
చిన్నారులకు అందుబాటులోకి మరో వ్యాక్సిన్.. కోవావ్యాక్స్‌కు ఎన్‌టాగి అనుమతి

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నాలుగో దశ విజృంభణ మొదలు కాబోతోందన్న వార్తల నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే వార్తే. 12-17 ఏళ్లలోపు వయసు వారికి కోసం సరికొత్త టీకా ఒకటి అందుబాటులోకి వచ్చింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి వచ్చిన ‘కోవావ్యాక్స్’కు తాజాగా నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టాగి) అనుమతులు మంజూరు చేసింది. ఈ టీకాను ఇమ్యునైజేషన్ డ్రైవ్‌లో భాగం చేయాలని ప్రభుత్వ ప్యానెల్ నిర్ణయించింది. కోవావ్యాక్స్ రాకతో 12-17 ఏళ్ల వయసు వారికి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్టు అయింది. 


దేశంలోని 12-14 ఏళ్ల లోపు చిన్నారుల కోసం మార్చి 16న వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా బయోలాజికల్-ఇ అభివృద్ధి చేసిన కోర్బెవ్యాక్స్‌ను ఇస్తున్నారు. కాగా, అత్యవసర పరిస్థితుల్లో కొన్ని షరతులకు లోబడి పెద్దలకు, అలాగే, 12-17 ఏళ్లలోపు వారికి కొవావ్యాక్స్‌ను ఇచ్చేందుకు గతేడాది డిసెంబరు 28న డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు ఇచ్చింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.