ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు: టీడీపీ సీనియర్ నేత ఆర్. శ్రీనివాస రెడ్డికి కువైత్‌లో ఘన స్వాగతం!

ABN , First Publish Date - 2022-06-11T01:10:38+05:30 IST

ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్. శ్రీనివాస్ రెడ్డి(వాసు) కువైత్‌కు చేరుకున్నారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు: టీడీపీ సీనియర్ నేత ఆర్. శ్రీనివాస రెడ్డికి కువైత్‌లో ఘన స్వాగతం!

ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆర్. శ్రీనివాస రెడ్డి(వాసు) కువైత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక టీడీపీ సభ్యులు, అభిమానులు పుష్పగుచ్ఛాలతో ఘనస్వాగతం పలికారు. కాగా..శకపురుషుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను కువైత్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఎన్నారై టీడీపీ సెల్ ఏర్పాట్లు చేసింది. జూన్ 10న ఖైతాన్ ప్రాంతంలోని ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ వేదికగా ఈ వేడుకలు జరుగుతాయి. సీనియర్ నేత ఆర్.శ్రీనివాస రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 





Updated Date - 2022-06-11T01:10:38+05:30 IST