ltrScrptTheme3

NTR30 : డిసెంబర్‌లో సెట్స్ పైకి?

Oct 27 2021 @ 16:40PM

యంగ్ టైగర్ యన్టీఆర్ నటించిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చేఏడాది జనవరి 7న విడుదల కాబోతోంది. ఇప్పటికే తారక్ ఆ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ పూర్తి చేశారు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో షూట్ కూడా పూర్తిచేశారు. ఇటీవలే ఈ షో చివరి ఎపిసోడ్ ను తారక్ కంప్లీట్ చేశారు. ఇక యన్టీఆర్ తదుపరిగా కొరటాల శివ దర్శకత్వంలోని సినిమాకి పూర్తి టైమ్ ను కేటాయించబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నారట. యన్టీఆర్ 30వ చిత్రంగా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా షూటింగ్ కు ఇంకా టైముంది కాబట్టి.. ఈ గ్యాప్ లో తారక్ .. హాలీడే ట్రిప్ కు వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. 



ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ‘ఆచార్య’ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసిన కొరటాల.. ఇప్పుడు యన్టీఆర్  సినిమా స్ర్కిప్ట్ ను లాక్ చేసే పనిలో ఉన్నారట. కొరటాల గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఓ సమాజిక అంశంతో తెరకెక్కనుంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత .. కొరటాల, తారక్ మళ్ళీ ఈ సినిమాతో కొలాబరేట్ అవుతుండడంతో  భారీ అంచనాలు నెలకొన్నాయి. యన్టీఆర్ ఆర్ట్స్ , యువ సుధా ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.