UKలో NTR జయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-05-06T19:51:47+05:30 IST

తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు జయంతి వేడుకల కోసం యూకేలోని ఎన్నారైలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నా

UKలో NTR జయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

ఎన్నారై డెస్క్: తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు జయంతి వేడుకల కోసం యూకేలోని ఎన్నారైలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ మహానాడు వేడుకలకు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 28న యూకేలోని Atrium, Lamptom school, Lampton avenue, Hounslow TW3 4EP వేదికగా మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జయ్ కుమార్ గుంటుపల్లి, పోపూరి వేణు మాధవ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎన్నారై టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. 


Read more