Delaware లో ఘనంగా NTR శతజయంతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-06-01T16:02:49+05:30 IST

అమెరికాలోని డెలవేర్ రాష్ట్ర కౌన్సిలర్లు సత్యా పొన్నగంటి, సుధాకర్ తురగ, శ్రీధర్ ఆలూరు, విశ్వనాథ్ కోగంటి ఆధ్వర్యంలో పెద్దఎత్తున మహిళలు, యువకులు పాల్గొనగా మిడిల్ టౌన్‌లోని సత్యా పొన్నగంటి స్వగృహంలో మహానటుడు, తెలుగు ప్రజల గుండె చప్పుడు అయిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

Delaware లో ఘనంగా NTR శతజయంతి ఉత్సవాలు

డెలవేర్: అమెరికాలోని డెలవేర్ రాష్ట్ర కౌన్సిలర్లు సత్యా పొన్నగంటి, సుధాకర్ తురగ, శ్రీధర్ ఆలూరు, విశ్వనాథ్ కోగంటి ఆధ్వర్యంలో పెద్దఎత్తున మహిళలు, యువకులు పాల్గొనగా మిడిల్ టౌన్‌లోని సత్యా పొన్నగంటి స్వగృహంలో మహానటుడు, తెలుగు ప్రజల గుండె చప్పుడు అయిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సభ జరిగినంత సేపూ అభిమానులు “జోహార్ ! ఎన్టీయార్ …” అంటూ మిన్నంటిన నినాదాలతో ఆద్యంతం హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆయన కళారంగానికి, రాష్ట్ర ప్రజానీకానికి చేసిన ఇతోధికసేవలను పలువురు కొనియాడి మరోసారి NTRను జ్ఞాపకం చేసుకోవటం జరిగింది. ఆంధ్రరాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆ మహానుభావుని ఆశయాలకు పునరంకితమవుతూ మన దార్శనికుడు చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా తీసుకురావటానికి తీవ్ర కృషి చేయాలనీ, అలాగే చేస్తామంటూ సభికులందరూ ముక్తకంఠంతో ప్రతిన పూనటం జరిగింది.







Updated Date - 2022-06-01T16:02:49+05:30 IST