కొండవాగు పొంగి ఎన్టీఆర్‌ కాలనీ నీటమునక

Sep 28 2021 @ 00:33AM
ఎ.కొండూరు ఎన్టీఆర్‌ కాలనీలో బాధితులను పరామర్శిస్తున్న దేవదత్‌

ఎ.కొండూరు: ఎన్టీఆర్‌ కాలనీలోకి వరద చేరి 60 గృహాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి శావల దేవదత్‌ బాధితులను పరా మర్శించి, వారికి అన్నపానీయాలు అందజేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. బాధితులకు సహాయం అందజే యడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రెవెన్యూ అధికారులు కొండవాగు ఆక్రమణలను తొలగించాలని డిమాండ్‌ చేశారు. రేపూడి తండా, చైత్యనగర్‌లో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామ చంద్రాపురంలో పిడుగు పడి కొబ్బరిచెట్టు, ప్రహరీ కూలిపోయాయి. కృష్ణారెడ్డి, డేవిడ్‌ రాజ్‌, నాగపద్మ, చైతన్య పాల్గొన్నారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.