ఎన్టీఆర్: నకిలీ నోట్ల ముఠా అరెస్టు

Published: Sat, 30 Apr 2022 20:49:41 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎన్టీఆర్: నకిలీ నోట్ల ముఠా అరెస్టు

ఎన్టీఆర్: జిల్లాలోని విసన్నపేట మండలం పుట్రేల వద్ద జరిగిన ఘటనలో నకిలీ నోట్ల ముఠాను విస్సన్నపేట పేట పోలీసులు అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు ఆయన వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 47 లక్షల 50 వేల  నకిలీ నోట్లను, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో  ప్రవేశ పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో మేకతోటి శశికిరణ్, గాలి రత్నం బాబు, పగిడిపల్లి గణేశ్ష్, తోట నరసింహారావులపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.