యుగ పురుషుడు ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-01-19T06:18:32+05:30 IST

నందమూరి తారకరామారావు యుగ పురుషుడు అని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి, ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శ్లాఘించారు.

యుగ పురుషుడు ఎన్టీఆర్‌

ఘనంగా నివాళులర్పించిన టీడీపీ నేతలు 


నందమూరి తారకరామారావు యుగ పురుషుడు అని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి, ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శ్లాఘించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా బీచ్‌ రోడ్డు, పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర, జిల్లా నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T06:18:32+05:30 IST