ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు

ABN , First Publish Date - 2022-05-29T06:29:54+05:30 IST

ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు భీమవ రం రెస్ట్‌హౌస్‌ రోడ్డులో యూత్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు కోళ్ళ నాగేశ్వరరావు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు.

ఘనంగా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు
భీమవరంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

వాడవాడలా ఎన్టీఆర్‌ విగ్రహాలకు నివాళి

భీమవరం టౌన్‌/వీరవాసరం, మే 28 :ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు భీమవ రం రెస్ట్‌హౌస్‌ రోడ్డులో యూత్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు కోళ్ళ నాగేశ్వరరావు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. టీడీపీ కార్యాలయంలోపట్టణ కన్వీనర్‌ వేండ్ర శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మైలాబత్తుల ఐజాక్‌బాబు, కోళ్ళ సీతారామ్‌, ఎండి షబీనా బేగం, నసీమాబేగం, కనకదుర్గ, చెల్లబోయిన గోవిందు, పడమట సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 200 లీటర్ల మజ్జిగ  పంపిణీ చేశారు. మద్దుల రాము, లంకి శ్రీనివాస్‌, మైలాబత్తుల  ఐజాక్‌ బాబు, ముచ్చకర్ల శివ పాల్గొన్నారు. వీరవాసరం మండలం నుంచి బస్సులో 50 మంది కార్యకర్తలు, సొంత వాహనాల్లో మరికొందరు మహానాడుకు వెళ్లారు. తొలుత వీరవాసరం బస్టాండ్‌ సెంటర్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు.

నరసాపురం నియోజకవర్గంలో..

నరసాపురం టౌన్‌/మొగల్తూరు, మే 28: నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, కొవ్వలి నాయుడు తదితరులు ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తీర ప్రాంతం నుంచి 50 కార్లలో ర్యాలీగా రెండో రోజు శనివారం మహానాడుకు తరలివెళ్లారు. జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, కొప్పాడ రవి, వాతాడి ఉమా, ఆకన సుబ్రహ్మణ్యం, గుబ్బల నాగరాజు తదితరులు ఉన్నారు. స్థానిక రాయపేట పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు చిటికెల రామ్మోహన్‌, రెడ్డిం శ్రీను, జొన్నల సతీష్‌, బళ్ల మూర్తి, ప్రతా్‌ప్‌, నాగరాజు పాల్గొన్నారు. మొగల్తూరు మండలంలోని పలు గ్రామాల్లో టీడీపీ మొగల్తూరు పట్టణ అధ్యక్షుడు బస్వాని ఏడుకొండలు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పార్టీ నాయకులు మన్నె దొరయ్య, మామిడిశెట్టి సత్యనారాయణ, తదితరులు పూల మాలలు వేశారు. అనంతరం మహానాడుకు సుమారు 30 కార్లలో పార్టీ మండల అధ్యక్షుడు గుబ్బల నాగరాజు ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు, అభిమానులు, తరలివెళ్లారు.  

ఉండి నియోజకవర్గంలో..

ఆకివీడు/ఉండి/పాలకోడేరు/ఆకివీడు రూరల్‌/కాళ్ల, మే 28 : తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలల చాటిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని టీడీపీ మండల–పట్టణ అధ్యక్షులు మోటుపల్లి రామవర ప్రసాద్‌, బొల్లా వెంకట్రావు అన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా శనివారం అయి–భీమవరం రోడ్‌లో ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ, పలు సెంటర్లలో ఎన్టీఆర్‌ విగ్రహాల వద్ద టీడీపీ నాయకులు కేక్‌ కట్‌చేసి దుప్పట్లు–పండ్లు అందజేసి మహానాడుకు తరలివెళ్లారు. అల్లు సాంబ, మధు, కొల్లి వెంకన్నబాబు, నాగ, రవి, నరేష్‌, నాగరాజు, సురేష్‌ ఉన్నారు. ఉండిలో టీడీపీ మండల అధ్యక్ష, కార్యదర్శులు, మాజీ మండల అధ్యక్షుడు జుత్తుగ శ్రీనివాసరావు, మోపిదేవి నాగ శ్రీనివాసరావు, పొత్తూరి వెంకటేశ్వరరాజు, కరిమెరక శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్‌ చేశారు. పార్టీ మండల ఉపాధ్యక్షుడు గురుగుబిల్లి సత్యనారాయణ, తెలుగు మహిళ అధ్యక్షురాలు వత్సవాయి సుజాత తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా మహానాడుకు తరలి వెళ్లారు.  పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను టీడీపీ గ్రామ అధ్యక్షుడు కాజా వీరాస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. వీరాస్వామి, బైర్రాజు నరసింహరావు తదితరులు ఉన్నారు. అనంతరం మహానాడుకు టీడీపీ అధ్యక్షుడు దెందుకూరి ఠాగూర్‌ కోటేశ్వరరాజు ఆధ్వర్యంలో 40 కార్లలో ఒంగోలు తరలి వెళ్ళారు. ఆకివీడు రూరల్‌ గ్రామం పెదకాపవరంలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో తోట ఏడుకొండలు, లంబాడి రామాంజనేయులు, మర్రివాడ వెంకట్రావు, చెన్నంశెట్టి శ్రీను పాల్గొన్నారు. కాళ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఎన్టీయార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. జీవీ నాగేశ్వర రావు, వక్కపట్ల హరిబాబు, కొప్పినీడి గణపతి, డొక్కు సోమేశ్వరరావు, ఆరేటి తాతపండు  తదితరులు ఉన్నారు. 

తణుకు నియోజకవర్గంలో..

తణుకు/ఇరగవరం, మే 28: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహాలకు మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ పరిమి వెంకన్నబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  పార్టీ నాయకులు తోట సూర్యనా రాయణ, గుబ్బల శ్రీను, కంటిపూడి రాంబాబు, తేతలి సాయి పాల్గొన్నారు.   తణుకు నుంచి కలగర వెంకట కృష్ణ, డాక్టర్‌ దొమ్మేటి వెంకట సుధాకర్‌, ఆనాల ఆదినారాయణ, చింతలపూడి సన్యాసిరావు, కొఠారు సత్యనారాయణ, తాతపూడి మారుతీరావు తదితరులు మహానాడుకు వెళ్లారు. మహానాడులో చేనేత కార్పొరేషన్‌ మాజీ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి పాల్గొని పార్టీ ప్రతినిధులతో కలసి పలు అంశాలపై చర్చించినట్టు తెలిపారు. ఇరగవరం మండలం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సారధ్యంలో మండల అధ్యక్షుడు గోపిశెట్టి రామకృష్ణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు చుక్కా సాయిబాబు, నాయకులు మానే భాస్కరరావు, కామన ఏడుకొండలు, అడ్డాల మెంటారావు, కాసగాని రామకృష్ణ, చోడే సంజీవరావు, కార్యకర్తలు తరలి వెళ్లారు. 

మహానాడులో రక్తదానం

తణుకు, మే 28: ఒంగోలు మహానాడుకు వచ్చిన కార్యకర్తలు పెద్దఎత్తున రక్తదానం చేయడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు నియో జకవర్గానికి చెందిన  టీడీపీ జిల్లా కార్యనిర్వా హక కార్యదర్శి మేడికొండ నాగయ్య రక్తదానం చేశారు. పార్టీ కార్యాలయంలో ప్రతినిధులు ఆయనకు ప్రశంసాపత్రం అందించారు. 

పాలకొల్లు నియోజకవర్గంలో..

పాలకొల్లు/యలమంచిలి, మే 28 : అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందిస్తే దాన్ని అమలు చేసిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కిందని మహానాడులో ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌, ఎమ్మెల్సీ రామారావు తదితరులతో కలిసి పార్టీ అంతర్గత విషయాలను చర్చించినట్టు తెలిపారు.  యలమంచిలి మండలంలో యలమంచిలి, అడవిపాలెం, శిరగాలపల్లి, ఎంపీ డీవో కార్యాలయ ఆవరణల వద్ద ఎన్టీఆర్‌ జయంతిని టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తాళ్లూరి శ్రీనివాస్‌(బుజ్జి) సమ కూర్చిన తొమ్మిది సైకిళ్లను పేదలకు ఉచితంగా అందించారు. శనగళ్ల శ్రీనివాస్‌, చిలుకూరి రాజ్యలక్ష్మిశ్రీనివాస్‌, చిలుకూరి శిరీష, కాసా సత్య, తాడి శశిధర్‌, కొడవటి సత్యనారాయణ, గొడబ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆచంట నియోజకవర్గంలో.. 

పోడూరు/ఆచంట/పెనుగొండ/పెనుమంట్ర, మే 28 మహానాయకుడు నందమూరి తారక రామారావు అని డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ దేవళ్ల ప్రసాదు అన్నారు. జిన్నూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. కొమ్ముచిక్కాలలో పార్టీ గ్రామ అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీటీసీలు భూపతిరాజు సరస్వతీ సత్యనారాయణరాజు, నాగరాజు, సుజాతకృష్ణంరాజు, కొమ్ముచిక్కాల గ్రామ టీడీపీ కార్యదర్శి కొసన అబ్బులు, పంచాయతీ వార్డు మెంబరు గుంటూరి రాజా, పాల్గొన్నారు. ఆచంట మండలంలో వల్లూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. కేతా మీరయ్య, తాళం శ్రీనివాస్‌, ఆరుమిల్లి సుబ్బారావు, పృధ్వీ, నేలపూడి రామ్మోహనరావు, దేవళ్ళ  రమేష్‌, ఏడిద శ్రీనివాస్‌, బండి ప్రసాద్‌, చిలుకూరి సీతారామ్‌ పాల్గొన్నారు. అనంతరం మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మహానాడుకు తరలి వెళ్లారు. పెనుగొండ మండలం సిద్దాంతం బస్టాండ్‌ సెంటర్‌లో వున్న ఎన్టీఆర్‌ విగ్రహానికి ర్యాలీ సాయిబాబు, కడలి సత్యనారాయణ, కె.విజయరామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వడలి గ్రామంలో వృద్ధులకు పాలు, రొట్టెలు, స్వీట్లు పంపిణీ చేశారు. పెనుమంట్ర మండలం ఓడూరు పంచాయాతీ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు నివాళులర్పించారు. కేకు కట్‌ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఇందుకూరి సుబ్బరాజు, సాయి సుబ్బరాజు, బాలం బాలకృష్ణ, మర్తిపాటి గోపి కృష్ణ, ఇమ్మానియేలు తదితరులు పాల్గొన్నారు. 





Updated Date - 2022-05-29T06:29:54+05:30 IST