విజయవాడ ఆటోనగర్‌లోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాభిషేకం చేస్తున్న మహిళా నేతలు
వాడవాడలా ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాలు
టీడీపీ నాయకుల సేవా కార్యక్రమాలు, అన్నదానాలు
నిమ్మకూరులో అంగరంగ వైభవంగా వేడుకలు
పాల్గొన్న నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు
రెండు జిల్లాల నుంచి మహానాడుకు తరలిన తమ్ముళ్లు
పశ్చిమ నియోజకవర్గం నుంచి భారీగా..
పోరాట స్ఫూర్తినింపిన నాయకుల ప్రసంగాలు
విజయవాడ, ఆంధ్రజ్యోతి : శక పురుషుడి శత జయంత్యుత్సవాలు జిల్లావ్యాప్తంగా సందడిగా జరిగాయి. అన్న ఎన్టీఆర్‌ను స్మరిస్తూ, ఆయన సేవానిరతిని స్తుతిస్తూ శనివారం వాడవాడలా కేకులు కట్ చేశారు. మహానాయకుడి విగ్రహాలకు ఘనంగా పుష్పాంజలి ఘటించారు. సేవా కార్యక్రమాలు, అన్నదానాలతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు. ఓవైపు ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో శత జయంత్యుత్సవాలు ఘనంగా జరగ్గా, నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానుల రాకతో గ్రామమంతా పండుగ వాతావరణ కనిపించింది. మరోవైపు ఒంగోలులో జరిగిన మహానాడు ముగింపు ఉత్సవం తమ్ముళ్లలో జోష్ నింపగా, నేతల స్ఫూర్తిదాయక ప్రసంగం భవిష్యత్తు పోరాటానికి బాటలు వేసింది.
కంకిపాడు మండలం ఈడుపుగల్లులో కేక్ కట్ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, మాజీ ఎంపీపీ దేవినేని రాజా తదితరులు
నగరంలోని కలెక్టరేట్లో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్ దిల్లీరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్
ఒంగోలులో కొల్లు రవీంద్ర బైక్ ర్యాలీ