ఎన్టీఆర్‌ను తెలుగుజాతి మరువదు

ABN , First Publish Date - 2022-01-19T05:50:53+05:30 IST

తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ను మరిచిపోలేరని పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు తెలిపారు.

ఎన్టీఆర్‌ను తెలుగుజాతి మరువదు
పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాలర్పిస్తున్న జిల్లా టీడీపీ నేతలు

పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు 

వాడవాడలా ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాలు 

అన్నదానాలు, రక్తదానాలు, వస్త్ర వితరణలు

గుంటూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): తెలుగుజాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ను మరిచిపోలేరని పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు తెలిపారు. ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకొని పార్టీ జిల్లా కార్యాలయంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం పెద్దఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్‌ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలు చోట్ల అన్నదానాలతో పాటు, రక్తదాన శిబిరాలు, పేదలకు వస్త్ర వితరణతో పాటు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను రాజకీయం, ఆర్థికంగా పైకి తేవాలన్న ఆలోచనతో పార్టీ పేట్టి వారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన ఘనత ఎన్టీఆర్‌దని కొనియాడారు. రక్త, అన్నదానం కార్యక్రమాలతో పాటు ఎంపీ గల్లా జయదేవ్‌ రూపొందించిన క్యాలెండర్‌ను అవిష్కరించారు. కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, నాయకులు కోవెలమూడి రవీంద్ర, మహ్మద్‌ నసీర్‌, డేగల ప్రభాకర, పిల్లి మాణిక్యరావు, పోతినేని శ్రీనివాసరావు, దాసరి రాజామాష్టారు, మద్దిరాల జోసఫ్‌ ఇమ్యానియల్‌ (మ్యాని), మానుకొండ శివప్రసాద్‌, కనపర్తి శ్రీనివాసరావు, సుఖవాసి శ్రీనివాసరావు, బుచ్చి రాంప్రసాద్‌, కంచర్ల శివరామయ్య, నాయుడు ఓంకార్‌, అన్నాబత్తుని జయలక్ష్మి, రావిపాటి సాయి, కళ్లం రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

-  పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ ఇన్‌ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర నేతృత్వంలో అన్ని డివిజన్లలో కార్యక్రమాలు జరిగాయి. 46వ డివిజన్‌, ముత్యాలరెడ్డినగర్‌, సాయిబాబారోడ్డు, లైబ్రరీ సెంటర్‌, నగరాలు, గుజ్జనగుండ్ల పార్క్‌, నల్లచెరువు, కొండా వెంకటప్పయ్య కాలనీ, మిర్చియార్డు, కుమార్‌ హోటల్‌ సెంటర్‌, ఎన్జీవో కాలనీల్లో అన్నదానాలు నిర్వహించారు. స్తంభాల గరువు, రామిరెడ్డినగర్‌లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. 

- ఎన్టీఆర్‌ స్టేడియంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పశ్చిమ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర, లాఫింగ్‌ క్లబ్‌ అధ్యక్షుడు లాల్‌వజీర్‌, ధర్మకిషోరి, కమల, లక్ష్మి, సుసీలమ్మ, దామాచర్ల శ్రీనివాసరావు తదితరులు నివాళులర్పించారు.  

-  టీడీపీ  తూర్పు ఇన్‌చార్జి మహ్మద్‌ నసీర్‌  ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరిగాయి.  ఎన్టీఆర్‌ కళా పరిషత్‌ అభిమాన సంఘం ఆధ్వర్యంలో చెవిటి మిషన్లు పంపిణీ చేశారు.  1, 2, 7, 14, 15, 17, 56వ డివిజన్లలో అన్నదానం, 12, 4, 6 డివిజన్లలో పేదలకు చీరలు, దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. సాధినేని శ్రీనివాసరావు,  పల్లా సుబ్రహ్మణ్యం, మాల్యాద్రి, గుడపిల్ల నవీన్‌, ఎల్చురి కిరణ్‌, బెళ్ల వెంకటేశ్రరరావు, జభి ఉల్లాహ్‌, కొనకల్ల సత్యం, బ్రహ్మసాని శ్రీనివాసరావు, సూరే శ్రీనివాస్‌, ఫిరోజ్‌ తదితరులు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 

- ఎంపీ జయదేవ్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెనాలి శ్రావణ్‌కుమార్‌, మహ్మద్‌ నసీర్‌, కోవెలమూడి రవీంద్ర, నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, నాయకులు రాజామాష్టారు, అన్నాబత్తుని జయలక్ష్మి, ముత్తినేని రాజేష్‌, మానం శ్రీనివాస్‌, వెంకట రాంచౌదరి, నరేంద్ర, దొడ్డపనేని రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.   

-  పొన్నూరు రోడ్డు విద్యుత్‌ శాఖ సర్కిల్‌ కార్యాలయ ప్రాంగణంలో తెలుగునాడు విద్యుత్‌ కార్మిక సంఘం, నందమూరి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిస్కం అధ్యక్షులు పుల్లా సుందరంబాబు, రీజనల్‌ అధ్యక్షులు ప్రసాద్‌, వేణు, సాయి, భాస్కర్‌, కొండలు,  మద్ది రామకృష్ణ, సురేష్‌, మురళి, శ్రీనివాస్‌, రాజా తదితరులు పాల్గొన్నారు. 

- అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి కొండా శివరామిరెడ్డి పీఎస్‌ మూర్తి, ఏవీకే సుజాత, మల్లేశ్వరరావు, అనురాధ, రాజ్యలక్ష్మి, రామలక్ష్మి, ఘన శ్యామాచార్యులు పాల్గొన్నారు. 

వాషింగ్‌టన్‌ డీసీలో.. 

యూఎస్‌లోని వాషింగ్‌టన్‌ డీసీలో తానా మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన ఆధ్వర్యంలో  ఎన్టీఆర్‌ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మిర్చి యార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, నరేంద్ర కొండాలి, అనిల్‌ ఉప్పలపాటి, రఘు మేక, అడుసుమల్లి రవి, సిద్ధార్థ బోయపాటి, సాయిసుమంత్‌ శ్రీరామ్‌, డాక్టర్‌ నాగ దేవినేని, డాక్టర్‌ లిఖిత్‌ యల్లా, రమేష్‌ అవిర్నేని తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-19T05:50:53+05:30 IST