ఎన్టీఆర్ స్టేడియంలో కిక్కిరిసిన జనం

ABN , First Publish Date - 2022-09-17T21:50:59+05:30 IST

ఎన్టీఆర్ స్టేడియం (NTR Stadium) జనంతో కిక్కిరిపోయింది. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినాన్ని’ నిర్వహించాలని

ఎన్టీఆర్ స్టేడియంలో కిక్కిరిసిన జనం

హైదరాబాద్: ఎన్టీఆర్ స్టేడియం (NTR Stadium) జనంతో కిక్కిరిపోయింది. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినాన్ని’ నిర్వహించాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా మూడు రోజుల పాటు ఈ సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియం బహిరంగ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఆదివాసీలు, బంజారాలు భారీగా తరలివస్తున్నారు. మరికొద్ది గంటల్లో స్టేడియానికి సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. ఆదివాసీ గిరిజన కళాకారుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ధూంధాం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రముఖంగా గిరిజన ఆదివాసీల సమస్యలపై కేసీఆర్ ప్రసంగిస్తారు. ఎస్టీ రిజర్వేషన్లు (ST Reservations), పోడు భూములపై కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ (TRS) వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు ఆదివాసీ, బంజారా భవనాలను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గిరిజనులకు సమాన హోదా రావాలని ఆకాంక్షించారు. పోడు భూముల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. బంజారాహిల్స్‌లోని రోడ్‌నెం.10లో ఆదివాసీ, బంజారా భవనాలను నిర్మించారు. రూ.24.68 కోట్లతో ఆదివాసీ భవన్‌‌, రూ.24.43 కోట్లతో బంజారా భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. 


తెలంగాణ (Telangana) సమాజం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి అడుగుపెట్టిన ఘటనకు వచ్చే ఏడాది సెప్టెంబరు 17తో 75 ఏళ్లు పూర్తవుతాయి. అందుకే ఈ ఏడాది సెప్టెంబరు 17 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 17 వరకు వజ్రోత్సవాలుగా పరిగణించాలని, మొదటి మూడు రోజులు, చివరి మూడు రోజులు ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సెప్టెంబర్‌ 17న ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినం’గా పాటించాలని, 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల’ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినేట్‌ సమావేశం నిర్ణయించింది. ముగింపు వేడుకలను వచ్చే ఏడాది(2023) సెప్టెంబర్‌ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కేబినెట్‌ తీర్మానించింది.


మూడు రోజుల కార్యక్రమాలు ఇలా...

సెప్టెంబరు 16: రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతీ యువకులు, మహిళలతో భారీ ర్యాలీలు నిర్వహించారు.

సెప్టెంబరు 17: సీఎం కేసీఆర్‌ పబ్లిక్‌ గార్డెన్‌లో జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని బంజారా భవన్‌, ఆదివాసీ భవన్‌లను కేసీఆర్‌ ప్రారంభించారు. నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా నుంచి ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం మీదుగా ఇందిరా పార్కు వద్ద గల ఎన్టీఆర్‌ స్టేడియం వరకు గోండు గుస్సాడీ, లంబాడీ తదితర కళారూపాలతో, సాంస్కృతిక ప్రదర్శనలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అక్కడే బహిరంగసభను నిర్వహిస్తున్నారు. సభకు కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తారు.

Updated Date - 2022-09-17T21:50:59+05:30 IST