ఎన్టీఆర్‌, వెంకటాద్రి చౌదరి విగ్రహాల ఏర్పాటు ముదావహం

ABN , First Publish Date - 2022-09-29T07:20:51+05:30 IST

యుగపురుషుడు నందమూరి తారక రామారావు, సేవా మూర్తి కొసరాజు వెంకటాద్రి చౌదరి (డాక్టర్‌ బాబు) విగ్రహాలు ఒకేచోట గుడ్లవల్లేరులో ఏర్పాటు చేయడం ముదావహమని విశ్రాంత విజిలెన్స్‌ కమిషనర్‌ కొసరాజు వీరయ్య చౌదరి (కె.వి.చౌదరి) అన్నారు.

ఎన్టీఆర్‌, వెంకటాద్రి చౌదరి విగ్రహాల ఏర్పాటు ముదావహం

 విశ్రాంత  విజిలెన్స్‌ కమిషనర్‌ కొసరాజు వీరయ్య చౌదరి

గుడ్లవల్లేరు, సెప్టెంబరు 28 : యుగపురుషుడు నందమూరి తారక రామారావు, సేవా మూర్తి కొసరాజు వెంకటాద్రి చౌదరి (డాక్టర్‌ బాబు) విగ్రహాలు ఒకేచోట గుడ్లవల్లేరులో ఏర్పాటు చేయడం ముదావహమని విశ్రాంత విజిలెన్స్‌  కమిషనర్‌ కొసరాజు వీరయ్య చౌదరి (కె.వి.చౌదరి) అన్నారు. గుడ్లవల్లేరులో బుధవారం స్వర్గీయ  కొసరాజు వెంకటాద్రి చౌదరి (డాక్టర్‌ బాబు) విగ్రహాన్ని వీరయ్య చౌదరి, ఎన్టీఆర్‌ విగ్రహాన్ని మచిలీపట్నం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆవిష్కరించారు. సేవా మూర్తి  వెంకటాద్రి చౌదరి విగ్రహాన్ని ఆవిష్కరిచడం ఆనందంగా ఉందన్నారు. రాజకీయాల్లో ఉండటం వేరు, ప్రజల అవసరాలను గుర్తెరిగి  సహా యం చేయడం వేరని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో  కొసరాజు బాపయ్య చౌదరి, ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ టీడీపీ ఇన్‌చార్జ్‌ రావి వెంకటేశ్వరరావు, అర్బన్‌బ్యాంక్‌ చైర్మన్‌ పిన్నమనేని పూర్ణవీరయ్య(బాబ్జి), వల్లభనేని బాబూరావు, వల్లభనేని వెంకట్రావు, జంగం మోహనరావు, పొట్లూరి రవి, పోలవరపు వెంకట్రావు, ఈడ్పుగంటి ఉమామహేశ్వరరావు, వల్లభనేని వెంకట సుబ్బారావు,  శాయిన పుఫ్పావతి,  కొసరాజు   కుటుంబ సభ్యులు,  టీడీపీ నాయకులు  పాల్గొన్నారు.

 కొడాలి నానీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : కొనకళ్ల

గుడ్లవల్లేరు : ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ పేరున మారుస్తుంటే నోరు మెదపని విశ్వాసం లేని కుక్క కొడాలి నాని అని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడ్లవల్లేరులో ఎన్టీఆర్‌  శతజయంతి ఉత్సవాల్లో బుధవారం కొనకళ్ల పాల్గొని మాట్లాడారు. వైఎ్‌సఆర్‌ కూతురు షర్మిళనే  యూనివర్సిటీ పేరు మార్చడాన్ని తప్పు పట్టిందన్నారు.  ఎన్టీఆర్‌ బొమ్మపై మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడక పోవడం ఆయన కుసంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలకు, తెలుగు జాతికి కొడాలి నాని  సమాధానం చెప్పి తీరాల్సిందేనన్నారు. మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ టూ వైఎస్సాఆర్‌ అని పేరు పెట్టి ఎడ్ల పోటీలు నిర్వహిస్తూ, నందమూరి  దైవం అం టూ ప్రజల్ని నమ్మబలికే నాని  వర్సిటీ పేరు మారుస్తుంటే ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. వెంటనే ప్రజలకు క్షమాపణ  చెప్పి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  తొలుత పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని పిన్నమనేని వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. గుడివాడ టీడీపీ ఇన్‌చార్జ్‌ రావి వెంకటేశ్వరరావు ఎన్టీఆర్‌ శత జయంతి కేక్‌ కట్‌చేశారు.  300 మంది వృద్ధులకు  దుస్తులు పంపిణీ చేశారు.  మండల పార్టీ అధ్యక్షుడు కొసరాజు బాపయ్య చౌదరి, వల్లభనేని బాబూరావు,  మోహనరావు,  నలగట్ల స్వామిదాసు,  అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పిన్నమనేని పూర్ణవీరయ్య(బాబ్జి),  వల్లభనేని వెంకట్రావు,   అడుసుమిల్లి రా మ్మోహనరావు (చంద్రాల చిట్టిబాబు),  అట్లూరి శ్రీరామ చంద్రప్రసాద్‌,  తూము పద్మజ,  కొడాలి రామరాజు, బొ ప్పన శివప్రసాద్‌, బెల్లంకొండ ఏడుకొండలు, వీరమాచనేని శివ ప్రసాద్‌,   శాయిన పుష్పావతి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-29T07:20:51+05:30 IST