NTR: ఆ ప్రేమ ముందు ఏదీ ఎక్కువ కాదు

Published: Fri, 20 May 2022 18:00:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
NTR: ఆ ప్రేమ ముందు ఏదీ ఎక్కువ కాదు

"అభిమానులు చూపించే ప్రేమ ముందు ఏదీ ఎక్కువ కాదు" అన్నారు జూ.ఎన్టీఆర్‌(NTR). శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా వివిధ ప్రాంతాల అభిమానులు, సినీ తారలు తారక్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులైతే ఉదయం నుంచే తారక్‌ ఇంటి దగ్గర సందడి మొదలుపెట్టారు. దీనిపై ఎన్టీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ లేఖ విడుదల చేశారు. ‘‘నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, తోటి నటీనటులు అందరకీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా. వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు మా ఇంటికి చేరుకున్నారు. అభిమానులు చూపించే ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ ప్రేమ, అభిమానం, ఆశీస్సుల ముందు ఏదీ ఎక్కువ కాదు. అయితే నేను ఇంట్లో లేకపోవడం వల్ల ఎవరినీ కలవలేకపోయాను. అందుకు నన్ను క్షమించాలి’’ అని తారక్‌ లేఖలో పేర్కొన్నారు. (ntr thanks to fans)


ఆయన పుట్టినరోజు సందర్భంగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘ఎన్టీఆర్‌ 30’ మోషన్‌ పోస్టర్‌, ప్రశాంత్‌ నీల్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఎన్టీఆర్‌ 31’ చిత్రాల ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ రెండు లుక్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International