రెండేళ్ల తర్వాత ‘నుడా’ పాలకవర్గం!

ABN , First Publish Date - 2021-07-27T04:43:37+05:30 IST

సుమారు రెండేళ్ల తర్వాత నెల్లూరు అర్బన డెవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా) పాలకవర్గం ఏర్పాటు కానుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇనచార్జుల పాలనలోనే నుడా నడుస్తోంది.

రెండేళ్ల తర్వాత  ‘నుడా’ పాలకవర్గం!

ఇప్పటికే చైర్మన పేరు ప్రకటన

అతి త్వరలో ఐదుగురు డైరెక్టర్ల నియామకం


నెల్లూరు(జడ్పీ), జూలై 26 : సుమారు రెండేళ్ల తర్వాత నెల్లూరు అర్బన డెవలప్‌మెంట్‌ అథారిటీ (నుడా) పాలకవర్గం ఏర్పాటు కానుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇనచార్జుల పాలనలోనే నుడా నడుస్తోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేసిన క్రమంలో నుడాకు చైర్మనగా ముక్కాల ద్వారకానాథ్‌ పేరును ప్రకటించారు. ఇక ఎన్నుకోవాల్సిన ఐదుగురు డైరెక్టర్లపైనే అధికార పార్టీలో ఉత్కంఠ నెలకొంది. నెల రోజుల క్రితమే ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు పేర్లు పంపాలని ప్రభుత్వం సూచించడంతో డైరెక్టర్లకు సంబంధించి జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ బాబితా అధిష్ఠానానికి పంపారు. పార్టీ విధేయులకే ఈ పదవులు కట్టబెడతారనే ప్రచారం ఉపందుకుంది. ఒకటి, రెండు రోజుల్లో డైరెక్టర్లు ఎవరనేది తేలిపోనుంది. 19 మండలాలు, 221 గ్రామాలలో విస్తరించి ఉన్న నుడాలో నెల్లూరు కార్పొరేషనతోపాటు 5 పురపాలక సంఘాలు ఉన్నాయి. నుడా ఏర్పాటు తరువాత నిధులు లేమితో ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వంలో అభివృద్ధి పథకం నుంచి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించి దాదాపు రూ.30 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అర్ధంతరంగా ఆగిపోయిన పనులు నేటికీ పునఃప్రారంభం కాలేదు. త్వరలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గంలోనైనా నుడా గాడిన పడుతుందో లేదో వేచి చూడాలి. 

Updated Date - 2021-07-27T04:43:37+05:30 IST