టెక్సాస్‌లో కొత్త కేసులు, మరణాలు తగ్గుముఖం

ABN , First Publish Date - 2020-09-04T00:17:32+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనా విలయం కొనసాగుతోంది. అయితే, టెక్సాస్ రాష్ట్రంలో మాత్రం కొత్త కేసులు, మరణాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

టెక్సాస్‌లో కొత్త కేసులు, మరణాలు తగ్గుముఖం

ఆస్టిన్(టెక్సాస్): అగ్రరాజ్యం అమెరికాలో మహమ్మారి కరోనా విలయం కొనసాగుతోంది. అయితే, టెక్సాస్ రాష్ట్రంలో మాత్రం కొత్త కేసులు, మరణాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం 4,157 కొత్త కేసులు నమోదయ్యాయి. జూలై 15న నమోదైన 10,791 పాజిటివ్ కేసులతో పొలిస్తే 61 శాతం తగ్గాయని అధికారులు వెల్లడించారు.  అలాగే నిన్న 189 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటివరకు టెక్సాస్ వ్యాప్తంగా కొవిడ్ సోకిన వారి సంఖ్య 6,21,667కు చేరితే... మొత్తం మరణాలు 12,870 అయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 86,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అమెరికాను వణికిస్తున్న మహమ్మారి ఇప్పటికే దేశవ్యాప్తంగా 1.90 లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. అలాగే 62.91 లక్షల మందికి ప్రబలింది.

Updated Date - 2020-09-04T00:17:32+05:30 IST