పొరపాటున కూడా మీ వాహనం నంబర్ ప్లేట్‌పై ఇలా చేయకండి.. లేదంటే..

ABN , First Publish Date - 2022-05-04T16:01:20+05:30 IST

కారు లేదా బండి నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్‌ లేదా..

పొరపాటున కూడా మీ వాహనం నంబర్ ప్లేట్‌పై ఇలా చేయకండి.. లేదంటే..

కారు లేదా బండి నడుపుతున్నప్పుడు సీట్ బెల్ట్‌ లేదా హెల్మెట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇదేవిధంగా కారు లేదా బండి నంబర్ ప్లేట్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చిక్కుల్లో పడతారు. చాలామంది తమ స్టేటస్‌ను ప్రదర్శించడానికి ఏవైనా రాతలు, కులం మొదలైనవి నంబర్ ప్లేట్‌పై రాస్తారు. ఆ తర్వాత కారు నంబర్ రాస్తారు. అయితే ఇది ఎలా సమస్యగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1990లోని రూల్ 50, 51లో నంబర్ ప్లేట్‌లకు సంబంధించి చాలా నియమాలు ఉన్నాయి.


ఈ నిబంధనల కారణంగా, వాహనం నంబర్ ప్లేట్‌ను ట్యాంపర్ చేయలేరు. ఆర్టీఓ ఇచ్చే నంబర్ ప్లేట్ పెట్టుకోవాలని దానిలో సూచించారు. ఈ నిబంధనల ప్రకారం, వాహనాల నంబర్ ప్లేట్‌పై హోదా లేదా కులాన్ని రాయకూడదు. వాహనం నంబర్‌ ప్లేట్‌పై ఎప్పుడూ ఎలాంటి పదాలను రాయకూడదు. అలాగే నంబర్ ప్లేట్‌పై నిమ్మకాయ-మిర్చి, నల్ల గుడ్డ మొదలైనవి కూడా కట్టకూడదు. అలా చేస్తే పోలీసు చలాన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి నిబంధనల ఉల్లంఘన జరిగితే అది మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 192 (1) ప్రకారం శిక్షార్హమైన నేరమని గుర్తించండి. అటువంటి వాహనాలు కనిపిస్తే పోలీసులు వాహనదారులపై చర్యలు తీసుకుంటారు. కాగా పలుచోట్ల హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను తప్పనిసరి చేశారు. 



Read more