నిలిపేసిన నర్సులకు త్వరలో ఉద్యోగాలు

ABN , First Publish Date - 2022-04-05T15:56:15+05:30 IST

హక్కుల కోసం ధర్నాలో పాల్గొన్న కారణంగా నిలిపివేసిన 800 మంది నర్సులకు ప్రభుత్వం తరఫున త్వరలోనే ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ

నిలిపేసిన నర్సులకు త్వరలో ఉద్యోగాలు

                               - మంత్రి సుబ్రమణ్యం


ప్యారీస్‌(చెన్నై): హక్కుల కోసం ధర్నాలో పాల్గొన్న కారణంగా నిలిపివేసిన 800 మంది నర్సులకు ప్రభుత్వం తరఫున త్వరలోనే ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో అమ్మ మినీ క్లినిక్‌ల్లో పనిచేసిన తాత్కాలిక వైద్యులు జీవనాధారం దెబ్బతినకుండా ప్రభుత్వం తరఫున ఉద్యోగావకాశాలు కల్పించడంలో ప్రాధాన్యత కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కరోనా ప్రభావం అధికంగా ఉన్న రోజుల్లో ఉద్యోగావకాశాలు కల్పించిన 3,200 మంది తాత్కాలిక నర్సుల్లో 800 మంది తమను పర్మినెంట్‌ చేయాలనే డిమాండ్‌తో తేనాంపేట డీఎంఎస్‌ కార్యాలయ ప్రాంగణంలో అనుమతి లేకుండా ధర్నాలో పాల్గొన్నారని, వీరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు ప్రభుత్వం పరిశీలించి మళ్లీ ఉద్యోగంలోకి చేర్చుకోనున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2022-04-05T15:56:15+05:30 IST