TS News: 12వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించిన మంత్రి హరీష్

ABN , First Publish Date - 2022-08-18T18:31:00+05:30 IST

పీవీ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజాలో 12వ గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.

TS News: 12వ గ్రాండ్ నర్సరీ మేళాను ప్రారంభించిన మంత్రి హరీష్

హైదరాబాద్ (Hyderabad): పీవీ మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజాలో 12వ గ్రాండ్ నర్సరీ మేళా (12th Grand Nursery Mela)ను మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గురువారం నుంచి ఈనెల 22 వరకు గ్రాండ్ నర్సరీ మేళ జరుగుతుందని, వివిధ రాష్ట్రాల నుంచి 120కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్టాల్స్‌లో 100కుపైగా అరుదైన మొక్కలు, విత్తనాలు, ఎరువులు, పరికరాలు ప్రదర్శిస్తూ.. విక్రయాలు జరుగుతాయన్నారు. పూలు, పండ్లు, గార్డెనింగ్ లాంటి మొక్కలు అందుబాటులో ఉన్నాయని, అన్ని ఒకే చోట దొరుకుతాయన్నారు.


గ్రామాల్లో హరితహారంతో మొక్కలు పెంచటం లాంటి కార్యక్రమం చేపడుతున్నామని, పల్లె ప్రకృతి వనాలు పెద్ద ఎత్తున ప్రారంభం అయ్యాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. చెట్ల పెంపకం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెలంగాణ శ్రీకారం చుట్టిందన్నారు. గతంలో ఒక మొక్క పెట్టి ఫోటో దిగి వెళ్లేవారు కానీ..  తెలంగాణ వచ్చాక 85 శాతం మొక్కలు బ్రతికేలా చర్యలు తీసుకుంటున్నామని, 31.6 శాతం గ్రీనరి పెరిగిందని చెప్పారు. 

Updated Date - 2022-08-18T18:31:00+05:30 IST