అంగన్‌వాడీల్లో పోషకాహారం!

ABN , First Publish Date - 2020-10-11T10:03:42+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులకు ఇక నుంచి తాజా కూరగాయలు, ఆకు కూరలతో కూడిన పోషకాహారం ఇవ్వనున్నారు.

అంగన్‌వాడీల్లో పోషకాహారం!

అంగన్‌వాడీ కేంద్రాల్లో న్యూట్రీషన్‌ గార్డెన్ల పెంపకం

ప్రత్యేక కార్యాచరణతో స్త్రీ, శిశు సంక్షేమశాఖ

సెంటర్లకు కూరగాయల మొక్కల సరఫరా

తాజా కూరగాయలతో అందనున్న మధ్యాహ్న భోజనం

గర్భిణులు, బాలింతలు చిన్నారులకు చేకూరనున్న ప్రయోజనం


కామారెడ్డి, అక్టోబరు 10: అంగన్‌వాడీ కేంద్రాల్లోని లబ్ధిదారులకు ఇక నుంచి తాజా కూరగాయలు, ఆకు కూరలతో కూడిన పోషకాహారం ఇవ్వనున్నారు. ఇదే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది. అందుకోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ శాఖ అధికారులు అంగన్‌వాడీ కేంద్రాల ఆవర ణలో అధిక పోషకాలుండే కూరగాయలు, ఆకు కూరలను(న్యూట్రీషన్‌ గార్డెన్ల) పెంపకానికి శ్రీకారం చుట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నే పెరటి తోటలు, కూరగాయల సాగు చేస్తే కేంద్రాని కి వచ్చే వారికి క్షేత్ర పరిశీలన ద్వారా అవగాహన కల్పించ డంతో పాటు వారికి ఇచ్చే ఆహారంలో తాజా కూరగాయ లు అందించవచ్చని మాతా శిశు సంరక్షణ శాఖ అధికా రులు భావిస్తున్నారు.


అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భి ణులు, బాలింతలు, మూడేళ్లు పైబడిన ప్రీస్కూల్‌ పిల్లల కు సెంటర్‌లోనే బియ్యం, పప్పు కూరగాయలతో వండిన పోషకాహారం ఇవ్వనున్నారు. వీటితో పాటు రోజుకు 200 మిల్లీ లీటర్ల పాలు, ఒక గుడ్డు చొప్పున ఇవ్వనున్నారు. ప్రస్తుతం అందజేస్తున్న పౌష్టికాహారానికి అనుబంధంగా మధ్యాహ్నభోజనంలో తాజా ఆకు కూరలు, కూరగాయల తో కూడిన పోషకాహారం ఇచ్చే కార్యక్రమానికి స్త్రీ, శిశు సంక్షేమశాఖ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అంగన్‌వా డీ కేంద్రాల ఆవరణలో న్యూట్రీషన్‌ గార్డెన్ల పెంప కం చేపట్టింది. స్థానికంగా లభ్యమయ్యే కూర గాయలతో పాటు ఆకు కూరలను పెం చాలని టీచర్లు, ఆయాలకు ఉన్నతాధికారులు సూచనలు చేశారు. అంతేకాకుండా గర్భిణు లు, బాలింతలు తమ ఇంటి పెరట్లోనూ న్యూట్రీషన్‌ గార్డెన్ల పెంపకం చేపట్టేలా ప్రోత్సహిస్తున్నారు.


పెంచుతున్న తోటలు

చిన్నారులు, బాలింతలు, గర్భిణులు పోషకాహార లోపంతో, రక్తహీనతతో బాధపడకూడదనే ఉద్దేశ్యంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఈ వినూత్న ప్రయో గానికి శ్రీకారం చుట్టింది. రక్తహీనత వల్ల పుట్టబోయే బిడ్డకు ఎలాంటి ఆరో గ్య సమస్యలు రాకుండా ఉండాలనే ఆలోచన చేసి అంగన్‌వాడీ సెంటర్లలో తాజా కూరగాయలను అందించాలని పరిసరాలలో న్యూట్రీషన్‌ గార్డెన్ల ఏర్పా ట్లు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతోంది. ప్రధానంగా బెండకాయ, టమాట, వంకాయ, సోరకాయ, చిక్కుడుకాయతో పాటు, పాలకూర, గోంగూర, బచ్చలికూర, కొత్తిమీర, పుదీన, మెంతికూర వంటి ఆకు కూరలను పెంచుతున్నారు. అయితే కొన్ని చోట్ల హరితహారంలో భాగంగా ఈ పాటికే పండ్ల చెట్లను నాటారు. కామారెడ్డి పట్టణం లోని పలు అంగన్‌వాడీ సెంటర్లలో సైతం గతంలోనే గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు తాజా కూరగాయలను అందించేందుకు అంగన్‌వాడీ కేంద్రాల వద్ద కిచెన్‌ గార్డెన్లను ఏర్పాటు చేసి వాటినే వండి వడ్డిస్తున్నారు.


 సంపూర్ణ పోషణ అందించేందుకు చర్యలు

జిల్లాలో 5 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లు ఉండగా వీటిలో 1,038 ముఖ్యమైన అంగన్‌వాడీ కేంద్రాలు, 155 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటి ద్వారా 1 నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 35వేల వరకు, 3 నుంచి ఆరేళ్ల వరకు గల చిన్నారులు 24 వేలకు పైగా ఉన్నారు. వీరితో పాటు గర్భిణులు 8,800, బాలింతలు 7,000ల వరకు ఉన్నారు. పోషణ్‌ అభియాన్‌ మాసోత్సవాల్లో ప్రతీ సంవత్సరం గర్భిణు లు, బాలింతలకు అవగాహన కల్పిస్తూ వస్తున్న ఐసీడీఎస్‌ అధికారులు ప్రస్తుతం పెరటితోటల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. సంపూర్ణపోషణ అందించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతూ పక్కనే ఉన్న కూరగాయలు, ఆకు కూరల వల్ల కలిగే లాభాలను గర్భిణులకు, బాలింతలకు వివరిస్తూ చిన్నారులకు సైతం మధ్యాహ్న భోజనంలో తాజా కూరగాయ లను అందించే ప్రయత్నాలు చేస్తున్నారు.


అన్ని సెంటర్లలో న్యూట్రీషన్‌ గార్డెన్లు- అనురాధ, ఐసీడీఎస్‌ పీడీ, కామారెడ్డి.

సొంత భవనాల్లో నడిచే అంగన్‌వాడీ కేంద్రాల్లో న్యూట్రీషన్‌ గార్డెన్లు ఏర్పాటు చేస్తున్నాం. హరితహారంలో భాగంగా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పూల మొక్కలు నాటుతున్నాం. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఎంతగానో ఉపయోగ పడతాయి. ప్రతీ కేంద్రం ఆహ్లాదకరంగా, ఆరోగ్య వంతమై న వాతావరణంగా రూపొందుతోంది.

Updated Date - 2020-10-11T10:03:42+05:30 IST