చిన్నారులకు పౌష్టికాహారం తప్పనిసరి

ABN , First Publish Date - 2022-01-20T06:47:24+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు తప్పనిసరిగా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు.

చిన్నారులకు పౌష్టికాహారం తప్పనిసరి
వాసాలమర్రి అంగడివాడీ కేంద్రంలో చిన్నారిని పలకరిస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పథి

తుర్కపల్లి, జనవరి 19: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు తప్పనిసరిగా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని కలెక్టర్‌ పమేలాసత్పథి ఆదేశించారు. మండలంలో ని వాసాలమర్రి, తిరుమలాపూర్‌ గ్రామాల్లో బుధవారం ఆమె పర్యటించి అంగన్‌వాడీకేంద్రాలు, అభివృద్ధి పనులను ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల పోషణస్థితిని గమనించారు. చిన్నారులతో ముచ్చటించి ఆటపాటల విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పోషకాహారలోపం లేకుండా పిల్లలు పెరిగే విధానాన్ని అమలు చేయాలన్నారు. తిరుమలాపూర్‌ గ్రామంలో వననర్సరీ, డంపింగ్‌ యార్డు, పల్లె ప్రకృతి వనాలను సందర్శించి సంతృప్తి వ్యక్తంచేశారు. ఆమెవెంట మండల ప్రత్యేకాధికారి శ్యాం సుందర్‌, ఎంపీడీవో ఉమాదేవి, సర్పంచ్‌ సత్యనారాయణ, ఎంపీవో శ్రీమాలిని, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అనిత, పంచాయతీ కార్యదర్శి జ్యోతి తదితరులు ఉన్నారు. అదేవిధంగా సీఎం దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామాన్ని కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారీ ఒక రి తర్వాత ఒకరు సందర్శించారు. కలెక్టర్‌ అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీచేసి వెళ్లగా, అదనపు కలెక్టర్‌ గ్రామం మొత్తం కలియదిరిగారు. గ్రామంలో చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆయనవెంట ఎంపీడీవో ఉమాదేవి ఉన్నారు. 

Updated Date - 2022-01-20T06:47:24+05:30 IST