ఎలాంటి ఆహారం మంచిది?

ABN , First Publish Date - 2021-09-18T05:38:22+05:30 IST

మంచి ఆహారం తింటేనే పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది. కొందరు పిల్లలు కొన్ని ఆహార పదార్థాలను తినరు. పిల్లలకు ఇష్టం లేదని తల్లిదండ్రులు వదిలేయకూడదు. పెరిగే పిల్లలు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరముంది...

ఎలాంటి ఆహారం మంచిది?

మంచి ఆహారం తింటేనే పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది. కొందరు పిల్లలు కొన్ని ఆహార పదార్థాలను తినరు. పిల్లలకు ఇష్టం లేదని తల్లిదండ్రులు వదిలేయకూడదు. పెరిగే పిల్లలు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా ఈ కొవిడ్‌ సమయంలో పిల్లలకు శక్తినిచ్చే ఆహారం తప్పనిసరి. 


  1.  పిల్లల్ని జంక్‌ఫుడ్‌, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌కి దూరంగా ఉంచాలి. రాగి జావ, ఓట్స్‌ను ఆహారంగా ఇవ్వాలి. వీటిలో బి విటమిన్‌ అధికంగా ఉంటుంది. మెదడుకు చురుకైన ఆహారమిది. త్వరగా జీర్ణమవుతాయి. 
  2. మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌ పిల్లలకు స్నాక్స్‌గా తినిపిస్తుండాలి. ఇవి శక్తినిచ్చే ఆహారం. వారంలో మూడు లేదా నాలుగు రోజులు కోడిగుడ్డు మెనూలో ఉండాలి. రోజూ ఉన్నా పర్వాలేదు. ఇందులో ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్లు పుష్కలం. ఆరోగ్యానికి మంచిది. 
  3. కందులు, అలసందలు, పెసలు ఇలా మనకు లోకల్‌గా దొరికే ధాన్యాలతో ఏదోక రూపంలో పిల్లలకు ఫుడ్‌ తయారు చేసి తినిపించాలి. ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవే పిల్లలకు సూపర్‌ ఫుడ్‌.
  4. తాజా కూరగాయలతో చేసిన ఆహారం, పండ్లు పిల్లల డైట్‌లో ఉండాల్సిందే. తినకుంటే వారికి ఇష్టమైన రీతిలో కొత్త వంటకాలను తయారు   చేయాలి. పండ్లు ఇష్టం లేకుంటే జ్యూస్‌ తయారు చేసి తాగించాలి. ఆకుకూరల్ని పిల్లల ఆహారంలో మర్చిపోకూడదు. కంటికి మంచిది. పైగా సులువుగా జీర్ణమవుతాయి. కారం కూడా పిల్లలకు కాస్త మెల్లగా అలవాటు చేయాలి. ఇకపోతే పెరుగన్నం పిల్లల ఆరోగ్యానికి మరీ మంచిది.

Updated Date - 2021-09-18T05:38:22+05:30 IST