పోషకాల పండు!

ABN , First Publish Date - 2022-05-23T07:11:54+05:30 IST

బొప్పాయి పండుని తినడానికి చాలా తక్కువ మంది ఆసక్తి చూపుతారు. నిజానికి ఈ పండులో పోషకాలు పుష్కలం. ఈ పండు తినడం వల్ల చేకూరే ప్రయోజనాలు ఇవి...

పోషకాల పండు!

బొప్పాయి పండుని తినడానికి చాలా తక్కువ మంది ఆసక్తి చూపుతారు. నిజానికి ఈ పండులో పోషకాలు పుష్కలం. ఈ పండు తినడం వల్ల చేకూరే ప్రయోజనాలు ఇవి...

బొప్పాయి తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల బారినపడకుండా కాపాడుతుంది.

ఇందులో ఫైబర్‌ శాతం ఎక్కువే. మలబద్ధకం సమస్య దరిచేరకుండా చూస్తుంది.

ఈ పండులో సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

అధిక బరువును తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తున్న వారు బొప్పాయిని తీసుకోవాలి. ఇందులో క్యాలరీలు తక్కువగా లభిస్తాయి. పొట్ట నిండిన ఫీలింగ్‌ ఉంటుంది. 

షుగర్‌ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటి్‌సతో బాధపడేవారు తీసుకోదగిన పండు ఇది.ఫ బొప్పాయి పండులో ఫైటోన్యూట్రియెంట్లు, ఫ్లావనాయిడ్లు ఉంటాయి. ఇవి కోలన్‌ కేన్సర్‌, ప్రొస్టేట్‌ కేన్సర్‌ వచ్చే అవకాశాలను బాగా తగ్గిస్తాయి. కాబట్టి తరచుగా ఈ పండు తినాలి. 


ఒత్తిడికి లోనయ్యే వారు ఈ పండు తినడం వల్ల ఉపశమనం పొందుతారు. ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ల నియంత్రించడంలో బొప్పాయి కీలకపాత్ర పోషిస్తుంది.

ఆర్థరైటి్‌సతో బాధపడేవారు ఈ పండు తినడం వల్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పులను తగ్గిస్తాయి. 

Updated Date - 2022-05-23T07:11:54+05:30 IST