మాతృభూమిని సందర్శించడం మానుకోరాదు

ABN , First Publish Date - 2022-06-27T12:39:12+05:30 IST

అమెరికాలో ఉన్న తెలుగు ప్రవాసీలు తెలుగు భాషను ప్రోత్సహించాలని, సొంత మట్టి వాసనలను మరిచిపోరాదని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ఎన్ని పనులున్నా మాతృభూమిని సందర్శిం

మాతృభూమిని సందర్శించడం మానుకోరాదు

తెలుగు భాషను ప్రోత్సహించాలి

ప్రవాసీలకు జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపు

న్యూఢిల్లీ, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో ఉన్న తెలుగు ప్రవాసీలు తెలుగు భాషను ప్రోత్సహించాలని, సొంత మట్టి వాసనలను మరిచిపోరాదని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. ఎన్ని పనులున్నా మాతృభూమిని సందర్శించడం మానుకోరాదని ఆయన సూచించారు. ప్రాంతీయాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అమెరికాలోని వాషింగ్టన్‌లో తెలుగు సమాజం ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘భారతదేశ స్వాతంత్య్రం కోసం మన పూర్వీకులు ఎంతగానో పోరాడినా ఆ ఫలాలు అందరికీ అందలేదన్న విషయాన్ని మరవరాదు. సొంత మనుషులను, ఆహారాన్ని, భాషను, సంస్కృతిని వదులుకొని వచ్చినా మీరు (ప్రవాసీలు) సుఖసంతోషాలతో ఉన్నారు. మీరు ఆర్థికంగా ఎదగడమే కాకుండా మీ కుటుంబాలు, మీ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


Updated Date - 2022-06-27T12:39:12+05:30 IST