నవరత్నాల పేరుతో నవమోసాలు

ABN , First Publish Date - 2022-05-16T06:30:24+05:30 IST

నవరత్నాల పేరుతో నవమోసాలు

నవరత్నాల పేరుతో నవమోసాలు
వీరపనేనిగూడెంలో ధరల పెరుగుదలను వివరిస్తూ కరపత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్సీ అర్జునుడు

 గన్నవరం, మే 15 : నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడుతూ, వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోచుకుతింటుందని టీడీపీ ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. మండలంలోని వీరపనేనిగూడెంలో ప్రతి ఇంటికీ తెలుగుదేశం, బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహిం చారు. ఇంటింటికీ వెళ్లి పెరిగిన ధరలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అర్జునుడు మాట్లాడుతూ వైసీపీ పరిపా లనలో రాష్ర్టాన్ని అభివృద్ధికి దూరం చేశారన్నారు. నవరత్నాల ముసుగులో నవబాదుళ్లు చేస్తూ ఆర్ధికంగా దెబ్బతీశారన్నారు. ఇసుక, మద్యం, పెట్రోల్‌ డీజిల్‌ గ్యాస్‌, చెత్త ఇంటి పన్నులు సిమెంట్‌, రిజిస్ర్టేషన్‌ ఛార్జీలు నిత్యావసర సరుకులు, ఆర్టీసీ ఛార్జీలు, విద్యుత్‌ ఛార్జీలను పెంచి సామాన్యుడిపై పెనుభారం మోపారన్నారు. రాష్ట్రంలో పాలన గాలికొదిలేశారన్నారు. ఈ మూడేళ్ళలో అభివృద్ధి శూన్యమన్నారు. జగన్‌ చేస్తున్న మోసాలకు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. మట్టిని అడ్డగోలుగా తవ్వేస్తున్నారని, అధికా రులు చూసి చూడనట్లు వ్యవహరించటం సరికాదన్నారు. అక్రమ మట్టి, గ్రావెల్‌ను అడ్డుకోవా లన్నారు. ఇంటింటికీ కవ్వొత్తి, అగ్గిపెట్టెలను పంపిణీ చేశారు. టీడీపీ గ్రామ అధ్యక్షుడు కొండేటి వెంకటేశ్వరరావు, కార్యదర్శి మెట్లపల్లి కృష్ణా, మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, కార్యదర్శి బోడపాటి రవికుమార్‌, రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న, జూపల్లి సురేష్‌, ఆరుమళ్ళ కృష్ణారెడ్డి, షేక్‌ అబుల్యాజ్‌, నిమ్మకూరి మధు, మేడేపల్లి రమా, మండవ లక్ష్మీ, చిక్కవరపు నాగమణి, రమ్యకృష్ణ, చీమలదండు రామకృష్ణ, మండవ అన్వేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-16T06:30:24+05:30 IST