వరి కోతలు షురూ

ABN , First Publish Date - 2020-09-26T08:17:42+05:30 IST

జిల్లాలో వర్షాకాలం వరి కోతలు మొదలయ్యాయి. వర్షాకా లం వేసిన వరి కోతకు రావడంతో రై తులు కోతలు మొదలుపెట్టారు. బోధన్‌ డివిజన్‌ పరిధిలో నాలుగు రోజుల క్రితమే రైతులు వరి కోతలు ప్రారంభించారు.

వరి కోతలు షురూ

బోధన్‌ డివిజన్‌లో మొదలైన వరి కోతలు

 ఈసారి భారీగా రానున్న ధాన్యం దిగుబడి

 557 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం

 మొదటి వారం నుంచి కొనుగోళ్లు ప్రారంభం

 ఏర్పాట్లు చేస్తున్న జిల్లా అధికారులు


నిజామాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/బోధన్‌ : జిల్లాలో వర్షాకాలం వరి కోతలు మొదలయ్యాయి. వర్షాకా లం వేసిన వరి కోతకు రావడంతో రై తులు కోతలు మొదలుపెట్టారు. బోధన్‌ డివిజన్‌ పరిధిలో నాలుగు రోజుల క్రితమే రైతులు వరి కోతలు ప్రారంభించారు. కోతలు మొదలు కావడంతో రైతులు కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తారా అ ని ఎదురుచూస్తున్నారు.


జిల్లాలో ప్రతియేటా బోధన్‌ డివిజ న్‌ పరిధిలో వరినాట్లు ముందుగా వేసి కోతలు కూడా ముం దుగానే ప్రారంభిస్తారు. ఈ ఏడాది జూన్‌లోనే బోధన్‌ డివి జన్‌ పరిధిలో వరి నాట్లువేశారు. డివిజన్‌ పరిధిలోని వర్ని, రుద్రూరు, మోస్రా, చందూరు, కోటగిరి, బోధన్‌ మండలాల లో వరి నాట్లు జూన్‌ మాసంలో కొనసాగడంతో వరి కోతలు కూడా ముందుగానే మొదలయ్యాయి.


ప్రస్తుతం డివిజన్‌ ప రిధిలోని ఆయా మండలాల్లో 10 10 దొడ్డు రకం ధాన్యం వ రి కోతలు మొదలయ్యాయి. యంత్రాలతో వరి కోతలు ము మ్మరం కావడంతో కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదు రుచూస్తున్నారు. డివిజన్‌ పరిధిలోని మండలాలలో నెలాఖ రులోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రై తులు కోరుతున్నారు.


కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైతే రై తులు దళారులను ఆశ్రయించకుండా ఉండే పరిస్థితులు ఉ న్నాయి. అంతేకాకుండా ధాన్యం ధరలు కూడా పడిపోకుం డా ఉండే అవకాశం ఉంది. దళారులు, వ్యాపారులు ధాన్యం ధరల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టకుండా ఉండే అ వకాశాలు ఉన్నాయి. దీంతో తక్షణమే ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.


 ఈసారి భారీగా రానున్న దిగుబడి

జిల్లాలో ఖరీఫ్‌ వరి ధాన్యం మార్కెట్‌ను ముంచెత్తనుం ది. జిల్లాలో ఈ వానాకాలంలో వరి విస్తీర్ణం బాగా పెరుగ డంతో అధికారులు కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు. ప్రతీ గ్రామంలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు నిర్ణ యించారు. ఈ సీజన్‌లో మొత్తం తొమ్మిది లక్షల మెట్రిక్‌ ట న్నుల కంటె ఎక్కువ దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు కనీసం ఏడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంను కొనుగోలు చేయాలని నిర్ణయించారు.


కొనుగోలుకు కావాల్సి న గన్నీ బ్యాగులతో పాటు ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. జి ల్లాలో ఈ వానాకాలంలో మూడు లక్షల 75 వేల ఎకరాలలో వరి సాగు చేశారు. నియంత్రిత సాగులో భాగంగా సన్న ర కాలను ఎక్కువగా వేశారు. గత ఏడాదికి మించి ఈ సారి సన్నరకాలను వేశారు. ఈ వానాకాలంలో వరి విస్తీర్ణం పెర గడం వల్ల దిగుబడి బాగా వస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు.


జిల్లాలో ప్రస్తుత వరి విస్తీర్ణంను బట్టి తొమ్మిది లక్షల మెట్రిక్‌ టన్నులు దాటి వస్తోందని అంచనా వేస్తున్నా రు. దీనిలో వ్యాపారులు రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల వర కు కొనుగోలు చేసినా.. మిగతా ఏడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యంను కొనుగోలు చేయాలని నిర్ణయించారు.  


ఈ దఫా మొత్తం 557 కొనుగోలు కేంద్రాలు 

జిల్లాలో ఈ దఫా మొత్తం 557 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, ఐ కేపీ, హాకా, మెప్మా, కొత్త వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిపిన అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ధాన్యం కొనుగోలుకు అవసరమైన గన్నీ బ్యాగులను సిద్ధం చేస్తున్నారు. ఈ ధపా 2 కోట్లకు పైగా గన్నీ బ్యాగులు అవ సరం ఉండడంతో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.' 


జిల్లాలో ప్రస్తుతం 60 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉండగా మిగతా బ్యాగులను తెప్పించేందుకు టెండర్టు పిలి చారు. జిల్లాలో అక్టోబరు మొదటి వారం నుంచి ధాన్యం కొ నుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బోధన్‌ డివిజన్‌ పరిధిలోని వర్ని, కోటగిరి మండలాల పరిధిలో ముందుగా ధాన్యం వచ్చే అవకాశం ఉండడంతో అక్కడ ఏర్పాట్లు చేస్తు న్నారు. ధాన్యం ఏ గ్రేడుకు క్వింటాలుకు మద్దతు ధర రూ. 1,888గా నిర్ణయించగా, బీ గ్రేడ్‌కు రూ.1,868లు నిర్ణయించా రు.


సన్న రకాలు ఎక్కువగా వేయడం వల్ల దానిని ఏ గ్రేడు కింద పరిగణించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభు త్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా కొనుగోలు చే సేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేం ద్రాలలో హమాలీల సమస్య ఉండకుండా ముందుగానే చ ర్యలు చేపడుతున్నారు. ధాన్యాన్ని చేరవేసేందుకు లారీల కొ రత రాకుండా ముందస్తుగా నిర్ణయం తీసుకుంటున్నారు.


జిల్లాలో అక్టోబరు మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోలుకు  నిర్ణయించామని డీఎస్‌వో వెంకటేశ్వర్‌రావు తెలిపారు. రైతు లకు ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ప్రతీ గ్రామంలో కనీసం ఒక్క కొనుగోలు కేంద్రం ఉండే విధంగా చూస్తున్నామని తెలిపారు.

Updated Date - 2020-09-26T08:17:42+05:30 IST