Advertisement

వనాలు ఆహ్లాదకరంగా ఉండేలా చూడాలి

Sep 26 2020 @ 02:35AM

 డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి

నిజాంసాగర్‌, సెప్టెంబరు 25 : గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదకరంగా ఉండా లని డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నిజాంసాగర్‌ మండలం బంజపల్లి, సుల్తాన్‌నగర్‌ గ్రామాల్లో పర్యటించారు. ఈ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ఇంపుగా ఉండే మొక్కలు నాటాలని ఆదేశించారు.


గ్రామాల్లో కంపోస్ట్‌ షెడ్‌ త్వర గతిన పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశిం చారు. ఆయన వెంట ఎంపీడీవో పర్బన్న, కార్యదర్శులు, నాయకులు ఉన్నారు.


 పల్లె ప్రగతి పనులు త్వరగా పూర్తి చేయాలి

పిట్లం : పల్లె ప్రగతి పనులను ప్రతీ గ్రామపంచా యతీల్లో త్వరగా పూర్తి చేయాలని డీఆర్‌డీవో చంద్ర మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని రాంపూర్‌లో పల్లె ప్రగతి వనాన్ని పరిశీలించారు. వైకుంఠ ధామం, డంపింగ్‌యార్డ్‌, కంపోస్ట్‌ షెడ్‌, ప్రకృతి వనాల ప నులు పూర్తి చేయాలని అఽధికారులకు సూచించారు. ఆయ న వెంట డీపీవో నరేష్‌, ఎంపీడీవో శ్రీనివ స్‌గౌడ్‌, ఏపీవో శివకుమార్‌, సర్పంచ్‌ నారాయణరెడ్డి, ఉన్నారు.

Follow Us on:
Advertisement
Advertisement