ఆగంజేసిన వాన

ABN , First Publish Date - 2020-10-08T11:16:46+05:30 IST

వరికోతలు ఊ పందుకున్న వేళ ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో అన్నదాత లను కలవర పెడుతోంది.

ఆగంజేసిన వాన

బోధన్‌ / డిచ్‌పల్లి / జక్రాన్‌పల్లి, అక్టోబరు 7:  వరికోతలు ఊ పందుకున్న వేళ ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడంతో అన్నదాత లను కలవర పెడుతోంది. బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ చిరు జల్లులు కురవడంతో కోసి ఆర బెట్టిన వరి, మొక్కజొన్న, సోయా తడిసింది. బోధన్‌, ఎడపల్లి, రెంజల్‌, వర్ని, రుద్రూరు, కోటగిరి, చందూరు, మోస్రా మండలా ల్లో వారం రోజులుగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.


బుధవారం ఉదయం నుంచి ఆకాశం మబ్బులు పట్టి ఉండడం.. చిరు జల్లులు కురవడంతో ధాన్యం ఆరబోసిన రైతులు వడ్లు తడ వకుండా ఉండేందుకు తంటాలు పడ్డారు. ఒక వైపు వాతావర ణంలో మార్పులు చోటు చేసు కోవడం.. రైతులు పచ్చిధాన్యాన్ని విక్రయించుకుంటున్నారు. ఇదే అదునుగా బావిస్తున్న దళారులు ధాన్యం ధరలను క్వింటాలుకు సుమారు రూ.వందకు పైగా తగ్గిం చి కొనుగోలు చేస్తున్నారు.


ధాన్యం కోసి రోడ్లకు ఇరువైపులా ఆర బోసిన రైతులు చిరుజల్లులకు ధాన్యం రాశులు తడవడంతో తడిసి న ధాన్యాన్ని కుప్పలు పోసు కున్నారు. వరికోతల సమయంలో వర్షం కురుస్తుండడం పట్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండిం చిన పంటలు చేతికొచ్చే సమయంలో కాలం దోబూచులాడుతోం దని రైతులు ఆవేదన చెందుతున్నారు. 


నీటమునిగిన వరి పొలాలు 

డిచ్‌పల్లి మండలంలోని యానంపల్లి, సుద్దులం, కోరట్‌పల్లి ప్రాంతాల్లో బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి వరి పైరు నీటిపాలైంది. రెండు గంటల పాటు కురడంతో సుద్దలంలో వరి పంట నీట మునిగింది. చేతికొచ్చిన పంట నీటమనగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

 

తడిసిన మొక్కజొన్న, సోయా

జక్రాన్‌పల్లి మండలంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో గ్రామాల్లో చేతికొచ్చిన మొక్కజొన్న, సోయా, వరి పంటకు నష్టం కలిగినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో కల్లాలో, రోడ్లపై ఆరబెట్టిన మొక్కజొన్న, సోయా తడిసి ముద్దయింది. మొక్కజొన్న, సోయా తడవకుండా రైతులు తాటి పత్రులు కప్పినప్పటికీ మొక్కజొన్న, సోయా కల్లాలలోని రోడ్లపై మొక్కజొన్న, సోయా ఆరబెట్టగా పూర్తిగా తడిసిపోయిందని రైతులు తెలిపారు. 

Updated Date - 2020-10-08T11:16:46+05:30 IST