నేడు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

ABN , First Publish Date - 2020-10-09T10:56:27+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ శుక్రవారం జరగనుంది.

నేడు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్

 గురువారమే పోలింగ్‌ కేంద్రాలకు తరలిన సిబ్బంది

 ఉమ్మడి జిల్లాలో 50 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

 పోలింగ్‌ సిబ్బందికి కరోనా కిట్లు ఇచ్చిన అధికారులు

 పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు


( ఆంధ్రజ్యోతి ప్రతినిధి నిజామాబాద్‌/ కామారెడ్డి ) : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ శుక్రవారం జరగనుంది. ఈ ఉప ఎన్ని క పోలింగ్‌ కోసం అధికారులు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పా ట్లు పూర్తి చేశారు. సిబ్బందికి పీపీఈ కిట్లు అందించారు. గురువారం నిజామాబాద్‌ నుంచి పోలింగ్‌ సిబ్బంది బ్యాలెట్‌ బాక్సులు, ఇతర సామగ్రితో ఉమ్మడి జిల్లా పరిధిలోని పో లింగ్‌ కేంద్రాలకు చేరారు. శుక్రవారం జరిగే పోలింగ్‌ ఏర్పా ట్లలో నిమగ్నమయ్యారు. పోలింగ్‌ సందర్బంగా ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్ర తా ఏర్పాట్లు చేశారు.


 ఉమ్మడి జిల్లాలో 50 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిధిలో మొత్తం 50 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌లో 28, కామారెడ్డిలో 22 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడిజిల్లా పరిధిలో మొత్తం 824 ఓట్లు (నిజామాబాద్‌లో 483, కామారెడ్డిలో 341) ఉన్నాయి. ఉమ్మ డి జిల్లాలో నిజామాబాద్‌లోని జడ్పీ పోలింగ్‌ కేంద్రంలో అ త్యధికంగా 67 మంది తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. అతి తక్కువగా చందూర్‌ పోలింగ్‌ కేంద్రంలో కే వలం నలుగురు మాత్రమే ఓటు వేయనున్నారు.


 399 మంది సిబ్బంది నియామకం

ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ కోసం 399 మంది సిబ్బం దిని నియమించారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు అ నుగుణంగా కేంద్రాల కరోనా స్ర్కీనింగ్‌ చేయనున్నారు. మా స్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. పోలింగ్‌ కేం ద్రాలలో పనిచేసే వారితో పాటు ఓటు వేసేందుకు వచ్చే వా రికి థర్మల్‌స్ర్కీనింగ్‌ తప్పనిసరి చేశారు. కరోనా పాజిటివ్‌ ఉన్న 24 మంది పోలింగ్‌ కేంద్రానికి వచ్చేందుకు వాహన సౌకర్యం కల్పించడంతో పాటు పీపీఈ కిట్లను అందించారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం నుంచి వెబ్‌ కాస్టింగ్‌ చేసేందుకు ఏ ర్పాట్లు చేశారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లు తక్కువగా ఉన్నా సిబ్బంది మాత్రం సాయంత్రం 5 గంటల వరకు వేచి చూసి ఆ తర్వాతనే బాక్సులను సీలు చేయనున్నారు.


సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ 

ఉమ్మడి జిల్లా పరిధిలో ఉదయం 9 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్‌ జరగనుంది. ఈ పోలింగ్‌ కోసం సిబ్బంది గురువారమే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. నిజామాబాద్‌ పాలిటెక్నిక్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌ కేంద్రం నుంచి ఉదయం సామగ్రిని సిబ్బంది తీసు కున్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిధిలో ఉన్న ఓట్లకు అనుగుణంగా బ్యాలెట్‌ పేపర్లు, బాక్సులను అందించారు. పోలింగ్‌ సిబ్బంది తమకు ఇచ్చిన బ్యాలెట్‌ పేపర్లు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకున్నారు. తమకు ఏర్పాటు చేసి న వాహనాల ద్వారా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.


పాలిటెక్నిక్‌ కళాశాలలో పోలింగ్‌ సందర్భంగా అనుసరించా ల్సిన నిబంధనలను వారికి వివరించారు. ప్రతి ఒక్కరూ కరో నా జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరికీ కొవిడ్‌ కిట్‌ను అందించారు. ఇందులో మాస్కులు, శానిటైజర్లతో పా టు పీపీఈ కిట్లు ఉన్నాయి. పోలింగ్‌ సిబ్బంది అందరికీ కరో నా నుంచి రక్షణ కోసం ఫేస్‌ మాస్కులను ఇచ్చారు. ప్రతి ఒక్కరూ కరోనా సోకకుండా విధులను నిర్వర్తించేందుకు అ వసరమైతే పీపీఈ కిట్లను ధరించేందుకు రిసెప్షన్‌ కేంద్రం వద్ద వీటిని అందించారు. వీటితో పాటు పోలింగ్‌ కేంద్రాలకు సం బంధించిన ఓటర్ల వివరాలను ఇచ్చారు. పోలింగ్‌ ముగి సిన తర్వాత శుక్రవారం సాయంత్రం మళ్లీ పాలిటెక్నిక్‌కే బ్యాలెట్‌ బాక్సులను తీసుకవచ్చి భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూంను ఏర్పాటు చేశారు.

  

 భారీ పోలీసు భద్రత

ఉమ్మడి జిల్లా పరిధిలో శుక్రవారం జరిగే పోలింగ్‌ కోసం భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతీ పోలింగ్‌ కేం ద్రం వద్ద ఆ మండల స్టేషన్‌ సిబ్బందితో పాటు మరికొంత మందిని నియమించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సివిల్‌, రి జర్వుడు, హోంగార్డుతో పాటు ఇతర సిబ్బందిని బందోబస్తు కు నియమించారు. నిజామాబాద్‌ సీపీ కార్తికేయ, కామారె డ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, సీనియర్‌ పోలీసు అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద గ ట్టి భద్రతను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించారు. వాహనాలను పోలింగ్‌ కేంద్రాల కు వంద అడుగుల దూరంలోనే నిలిపి వేయనున్నారు.


 పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు..రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి

 ఉమ్మడి జిల్లా పరిధిలో శుక్రవారం జరిగే పోలింగ్‌ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్‌ అధికారి, కామారె డ్డి కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. కరోనా నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సిబ్బం దికి కొవిడ్‌ కిట్‌ను అందించామన్నారు. మాస్కులు ధరించ డంతో పాటు అవసరమైన చోట వినియోగించుకునేందుకు ప్రతీ పోలింగ్‌ కేంద్రానికి పీపీఈ కిట్లను ఇచ్చామన్నారు.


లింగ్‌ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో ఓటర్లు, ఏజెం ట్లు, పోటీ చేస్తున్న అభ్యర్థులను మినహా వేరే ఎవరినీ అ నుమతించమని కలెక్టర్‌ తెలిపారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రం లో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను నిజామాబాద్‌ పాలి టెక్నిక్‌లో భద్రపరు స్తామన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రశాంతంగా ఓటు వే సే అవకాశం కల్పించామని తెలి పారు. ఈ ఉప ఎన్నిక పో లింగ్‌ ప్రశాంతంగా జరి గేందుకు అందరూ సహకరించాలని  కలెక్టర్‌ నారా యణ రెడ్డి కోరారు.

Updated Date - 2020-10-09T10:56:27+05:30 IST